
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘శరదృతువు (ఆకులు రాలే కాలం) అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ శ్రియా శరణ్ తన పెళ్లి సమయంలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గాయని చిన్మయి శ్రీపాద ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఓ చిలక దానంతట అదే కొబ్బరికాయను తెంపి కొబ్బరినీళ్లు తాగుతున్నట్టుగా ఉంది. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోని మీరూ చూసేయండి...
అందాల భామ స్నేహ ఓ బాబుతో జిమ్లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘వ్యాయామంతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుంది’ అని అర్థం వచ్చే వ్యాఖ్యని జత చేసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా షూటింగ్ సమయంలో తను ఎంత బిజీగా ఉంటుందో తెలిపే వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘నేను షూటింగ్ సమయాన్ని ఎంత మిస్సవుతున్నానో చూడండి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార చామంతి పూల చాటున దిగిన తన ఫొటోని పోస్ట్ చేసింది.
అట్లతద్ది సందర్భంగా తన భర్త అల్లు అర్జున్తో దిగిన ఫొటోని స్నేహా రెడ్డి అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ కీర్తి సురేశ్ టీ గ్లాస్ పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘కొన్ని సందర్భాల్లో వర్చువల్ ప్రమోషన్లలో భాగంగా టీ షర్టు, ఓ కప్పు టీ అవసరం ఎంతో ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
ఈ రోజు ఉత్తరాదిన కర్వా చౌత్ పండుగను జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ బిపాసా బసు గత సంవత్సరపు జ్ఞాపకాన్ని అభిమానులతో నెమరు వేసుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...