బాలీవుడ్ సుందరి భాగ్యశ్రీ ఆనందంతో గంతులేస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సోమవారం ఇలా సంతోషంగా ఉంటే వారమంతా ఆనందంగా గడిచిపోతుంది. నా కూతురు, భర్త ‘నువ్వు ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నావ్?’ అని ఎప్పుడూ అడుగుతుంటారు.
మీరు సోమవారం ఉదయం లేచేటప్పుడు ఎలాంటి భావనతో ఉంటారు?
1. ఉత్సాహం
2. బద్ధకం
3. కోపం
4. సంతోషం
5. ప్రశాంతత
పై వాటిలో మీ ఫీలింగ్ ఏదో చెప్పండి!’ అంటూ అభిమానులను అడుగుతోందీ అలనాటి అందాల తార.
అందాల భామ పాయల్ ఘోష్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఉన్నతంగా ఆలోచించే మహిళలు తమకెదురయ్యే కష్టాలను విజయానికి సోపానాలుగా మలచుకుంటారు’ అని అర్థం వచ్చేట్టుగా క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇస్మార్ట్ భామ నభా నటేష్ స్వెట్టర్ ధరించి బెడ్‌పై పడుకున్న ఫొటోని పోస్ట్ చేస్తూ చలికాలం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే సముద్రపు ఒడ్డున దిగిన ఓ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే తన సోదరికి 21వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో దిగిన ఓ ఫొటోని పంచుకుంది.
అలనాటి తార సుహాసిని త్రోబ్యాక్ అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అలనాటి మధుర జ్ఞాపకం.. అద్భుతమైన మహిళలు.. నేను ఆరాధించే ఓ లెజెండ్.. ఆమె ఒక గొప్ప అష్టావధాని.. మిస్ భానుమతి’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి సోనమ్ కపూర్ తన సహనటి మసాబా గుప్తాతో దిగిన ఫొటోని పంచుకుంటూ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అందాల తార సన్నీ లియోన్ హాలోవీన్ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
హరియాణా సుందరి మల్లికా శెరావత్ చెట్టుని ఆలింగనం చేసుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘చెట్టుని ఆలింగనం చేసుకోవడం ఎంతో మంచిది. దీనివల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్ (హ్యాపీ హార్మోన్) అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది’ అని చెప్పుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...