బాలీవుడ్ ముద్దుగుమ్మ దియా మీర్జా ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో మూడు పక్షులు కరెంట్ తీగలపై సామాజిక దూరం పాటిస్తున్నట్టుగా కూర్చున్నాయి. దీనికి ‘బయటకు వెళ్లినప్పుడు దయచేసి సామాజిక దూరం పాటించండి’ అన్నట్లుగా ఈ మూడు పక్షులు మనకు చక్కటి సందేశాన్ని అందిస్తున్నాయి కదూ! అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి!’ అనే సందేశాత్మక క్యాప్షన్ పెట్టింది.
దక్షిణాది భామ శృతీ హాసన్ ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా ఓ జిఫ్ ఫొటోని పోస్ట్ చేస్తూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా తన ఫౌండేషన్ ద్వారా కొంతమంది అమ్మాయిలకు ఆహారాన్ని అందిస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ‘నా ప్రపంచం.. నా బలం వీళ్లే!’ అంటూ తన పిల్లలతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ సుందరి సోహా అలీ ఖాన్ తన భర్త, కూతురితో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘హాలోవీన్ డే’ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోలో ముగ్గురూ మ్యాచింగ్ దుస్తులు ధరించి మెరిసిపోయారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార తన పెట్ డాగ్‌ని హగ్ చేసుకున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా కోర్ వ్యాయామాలు చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీ శరీరం ఫిట్‌గా ఉంటే మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లే! కాబట్టి కోర్ వ్యాయామాలతో మీ శరీరాన్ని దృఢంగా మలచుకోండి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ని జోడించింది. దీనికి జిమ్, డోంట్ గివ్ అప్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
టాలీవుడ్ నటి రష్మిక మందన బరువులెత్తుతోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీకు ఏది కావాలన్నా.. ప్రయత్నించండి.. సాధించండి’ అని రాసుకొచ్చింది.
అందాల భామ అసిన్ తన పాప మూడో పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా అప్డేట్స్ని అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి...