దక్షిణాది తార నిత్యా మేనన్ కొత్త హెయిర్ స్టైల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ పునర్నవి భూపాలం వేలికి ఉంగరం, ఆ ముందు ఒక అబ్బాయి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘బిగ్ న్యూస్ చెబుతా’ అని చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో అంతా పునర్నవికి పెళ్లి ఫిక్స్ అయిందని భావించారు. కానీ ఆమె ‘కమిట్ మెంటల్’ అనే పోస్టర్ని పోస్ట్ చేసి అది పెళ్లి కాదు.. వెబ్‌సిరీస్ అని తేల్చేసింది. ఈ సందర్భంగా ‘తప్పలేక ఒప్పుకున్నాను.. ఇంకా ముందుంది అసలైన క్రేజీ రైడ్’ అని రాసుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ‘త్రో బ్యాక్ థర్స్డే’ అంటూ తన భర్త, పెట్‌తో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అప్పటికప్పుడు అనుకొని వెళ్లే మా సరదా ట్రిప్‌లను మిస్సవుతున్నాను. పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయా అని ఎదురుచూస్తున్నా’ అంటూ పతిపరమేశ్వర్, బ్రూనో, టింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
నటి నమ్రత షూటింగ్ సెట్లో దిగిన తన భర్త ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ఈ మూడు పదాలు మాలో చాలామందికి ఉత్సాహాన్నిస్తాయి’ అంటూ లైఫ్ ఆన్ సెట్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కొడుకు ఇజాన్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా జీవితంలో వెలుగులు నింపిన నా బంగారు కొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వే నా సర్వస్వం.. నీ రాకతో నా ప్రపంచాన్నే మార్చేశావు. నువ్వు అపరితమైన ప్రేమ, ఆనందం, సంతోషాలతో మా హృదయాలను నింపేశావు. నీకు కావాల్సినవి ప్రసాదించాలని, నీకు మార్గనిర్దేశనం చేయాలని ఆ అల్లాని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ఇజాన్ మీర్జా మాలిక్ ఖాతాని జోడించింది.
సినీ నటి కాజల్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఓ ఫొటోతో పాటు పెళ్లికి మేకప్ అయిన మరో ఫొటోను కూడా పంచుకుందీ అందాల చందమామ.
బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘లాక్డౌన్ జీవితాన్ని తెలిపే ప్రతీకాత్మక చిత్రం’ అంటూ రాసుకొచ్చింది.
బాపూ బొమ్మ స్నేహ తన స్నేహితురాలు, నటి శ్రీదేవిని ఆలింగనం చేసుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా బెస్టీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.. లవ్యూ’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తన కూతురు, తండ్రితో దిగిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...