శ్రీలంకన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన తాజా ఫొటోని పంచుకుంటూ ‘ఈ ప్రపంచం వద్దన్నా.. మీకు నచ్చిన పనే చేయండి’ అని క్యాప్షన్ పెట్టింది.
టాలీవుడ్ భామ వితిక తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘సాగర తీరాన.. ఓ అందమైన సాయంత్రం’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెల తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నా కృతజ్ఞత అంతులేనిది’ అని చెప్పుకొచ్చింది.
కాబోయే పెళ్లి కూతురు, నటి కాజల్ అగర్వాల్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘తను ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఎదగడానికి అవకాశాలను సృష్టించుకుంది.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకుంది..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చిందీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ మొక్కలకు నీళ్లు పోస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రతి ఒక్కరి జీవితం నీటి చుక్కతోనే మొదలవుతుంది’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి లారా దత్తా భూపతి తను మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ‘అది 2000సంవత్సరం. నేను మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచినప్పుడు నా స్వస్థలం బెంగళూరులో అభిమానులు నాకు సాదర స్వాగతం పలికారు. ఆ సమయంలో నాతో పాటు ఉన్న మిస్ యూనివర్స్ నిర్వాహకులు అభిమానుల కోలాహలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత అభిమానాన్ని వారు ఇంతకుముందెన్నడూ చూసుండరు. నేను ఇప్పటికీ ఆ పరేడ్‌లో పాల్గొన్న వారితో మాట్లాడుతుంటాను(అప్పుడు చిన్నపిల్లలు). అది మేము ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని వారు గుర్తుచేసుకుంటారు. నాకు కూడా ఇదో మంచి జ్ఞాపకంలా చిరకాలం గుర్తుండిపోతుంది’ అంటూ మిస్ యూనివర్స్, 20 సంవత్సరాలు, బెంగళూరు, జ్ఞాపకాలు, ఐ లవ్ మై ఇండియా హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన ఐపీఎల్ క్రికెట్ జట్టు(పంజాబ్) సభ్యులతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మేము హోటల్లోకి ప్రవేశించగానే ఈ ఫొటో తీసుకున్నాం. కోల్‌కతాపై భారీ విజయం సాధించిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి’ అంటూ ఐపీఎల్ 2020, యూనివర్స్ బాస్, విక్టరీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
తెలుగు భామ తేజస్వీ మదివాడ పచ్చని ప్రకృతి నడుమ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నా’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ తన తాజా ఫొటోని పంచుకుంటూ షేక్స్పియర్ రాసిన కొటేషన్‌ని పోస్ట్ చేసింది. ‘అందరినీ ప్రేమించండి.. కొందరినే నమ్మండి.. ఎవరికీ హాని చేయకండి’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు ఇన్స్టాపురంలో పోస్టులు పెట్టారు. వాటిని ఓసారి చూద్దాం రండి...