బాలీవుడ్ సుందరి మల్లికా శెరావత్ తన పుట్టినరోజు వేడుకలను ముగించుకుని తిరిగి తన వర్కౌట్ రొటీన్‌ను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ అను ఇమ్మాన్యుయెల్ పండగ సందర్భంగా పట్టు చీరలో దర్శనమిచ్చింది. అచ్చతెలుగు అమ్మాయిలా మెరిసిపోతున్న ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి...
అందాల తార నోరా ఫతేహి షూటింగ్లో భాగంగా సింగర్ గురు రంధ్వాతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘చందమామ’ బ్యూటీ కాజల్ అగర్వాల్ పండగ సందర్భంగా తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటి సమంతతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నేను మంచి మనసున్న అందమైన వ్యక్తిని కలిశాను. ఈరోజుని నాకు మంచి జ్ఞాపకంగా మార్చిన మీకు (సమంత) ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తన పెట్‌తో సరదాగా గడుపుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మూగజీవాలు మంచి స్నేహితులు.. అవి మనల్ని ఎటువంటి ప్రశ్నలు అడగవు.. విమర్శలు చేయవు’ అంటూ పెట్, పెట్ లవర్స్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ సుందరి సన్నీ లియోన్ ‘ఐసొలేటెడ్ వర్క్ మోడ్’ అంటూ ఇంటి దగ్గరే పని చేస్తున్న ఫొటోని పోస్ట్ చేసింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి షూటింగ్లో భాగంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మీకు నచ్చిన పనిని చేయండి.. మీరు చేసే పనిని ప్రేమించండి.. ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన ప్లేస్’ అంటూ షూటింగ్‌పై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పిందీ తార.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా సింగర్ నేహా కక్కర్ పెళ్లికి హాజరైంది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. ఓసారి వాటిని చూసేద్దాం రండి...
వీరితో పాటు ప్రగ్యా జైస్వాల్, దిశా పటానీ, భూమీ పెడ్నేకర్, సోనాల్ చౌహాన్లు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...