అందాల తార అంజలి ‘సిటీకి దూరంగా’ అంటూ ఓ రాయిపై కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ఆకాశం, చెట్లు, కొండలు, ప్రకృతి వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విమానంలో మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మాస్క్ ధరించి బయటకు చూడండి’ అని రాసుకొచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ‘త్రోబ్యాక్ థర్స్డే’ అంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ట్రావెలింగ్‌లో భాగంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త సంస్కృతులు - సంప్రదాయల గురించి తెలుసుకోవడం, అక్కడి రుచుల్ని ఆస్వాదించడం.. ఇవన్నీ మిస్సవుతున్నాను. కానీ ఈ సమయంలో మనం చేయాల్సిందల్లా మన కోసం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంటి దగ్గరే ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. టూర్లకు వెళ్లేంత వరకైనా ఇలా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం..’ అని చెప్పుకొచ్చింది.
గాయని మధుప్రియ ఓ బాబుతో సరదాగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియా మాల్దీవుల్లో సరదాగా గడిపిన ఫొటోలను పోస్ట్ చేసింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని పోస్ట్ చేసింది.
అలనాటి అందాల తార నీనా గుప్తా ఆకుకూరలు కోస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది’ అని చెప్పుకొచ్చింది.
డ్యాన్సర్ దీప్తీ సునైనా తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఏ పనైనా తిరిగి ప్రారంభించడానికి ఎప్పుడూ భయపడకండి... ఈసారి మీరు మొదటి నుంచి ప్రారంభించడం లేదు.. గత అనుభవాలను తెలుసుకొని మొదలుపెడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని రాసుకొచ్చింది.
హీరో మహేష్ బాబు గారాల పట్టి సితార తన స్నేహితురాలు యానాతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...