‘మహానటి’ కీర్తి సురేశ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ దంపతులు, నటి మీనా తదితరులు తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మిల్కీబ్యూటీ తమన్నా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చికిత్స తీసుకున్న హాస్పిటల్ డాక్టర్లు, నర్సులతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నేను కరోనా వైరస్ బారిన పడినప్పుడు హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ చేసిన వైద్య సహాయం గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. నేను మొదట నీరసంగా, బలహీనంగా, భయంతో ఉన్న సమయంలో నన్ను సౌకర్యంగా, ధైర్యంగా ఉండేలా చేశారు. మీ మంచి మనసు, శ్రద్ధ, సంరక్షణ... ఇవే నన్ను కరోనా నుంచి కోలుకునేలా చేశాయి’ అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ వ్యాయామం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ‘తిన్నావా?’ అనే కార్డును పట్టుకొని దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఏం బాబూ తిన్నావా??’ అంటూ హీరో నితిన్ ఖాతాను జోడించింది.
బాలీవుడ్ తార షమితా శెట్టి తన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ప్రతి రోజుని సానుకూల దృక్పథం, కృతజ్ఞతా భావంతో ప్రారంభించండి’ అని చెప్పుకొచ్చింది.
నటి సంయుక్తా హెగ్డే వ్యాయామం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఒక్కటే జీవితం, ఒక్కటే ప్రపంచం.. అన్వేషించండి’ అంటూ పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటి విద్యా బాలన్ సంప్రదాయ వస్త్రధారణలో టెంపుల్ జ్యుయలరీ ధరించిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నవరాత్రి శుభాకాంక్షలు.. అమ్మవారి శక్తిని తెలిపే సమయం’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి నందితా శ్వేత ‘చీరే సమస్తం’ అంటూ అందమైన చీరకట్టులో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ హంసానందిని తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఆ దుర్గామాత తన తొమ్మిది అవతారాలలో మనందరినీ తొమ్మిది లక్షణాల (శక్తి, సంతోషం, మానవత్వం, శాంతి, జ్ఞానం, విశ్వాసం, బలం, షరతులు లేని ప్రేమ, బలమైన రోగనిరోధక శక్తి)తో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి నుంచి మనందరం కోలుకొని దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ భామ భానుశ్రీ తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘అందమైన వ్యక్తులు అన్ని సందర్భాలలోనూ మంచిగా ఉండకపోవచ్చు.. కానీ, మంచి వ్యక్తులు ఎప్పటికీ మంచిగానే ఉంటారు’ అని చెప్పుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి వాటి పైనా ఓ లుక్కేయండి..