సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని ఆహారం తీసుకుంటున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఈ ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మంచి మార్పులు చేసుకోండి..
* నీరు అద్భుతమైన ఔషధం. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ నీటిని తాగండి.
* ఆకుపచ్చని కాయగూరలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి.
* రోజుకి కనీసం ఒక పండు తినండి. ఇది గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
* నట్స్‌ను కూడా ఎక్కువగా తీసుకోవాలి.
మీరు ఈ రోజు ఏ రంగు కాయగూరలను తీసుకున్నారో నాతో పంచుకోండి’ అంటూ ప్రపంచ ఆహార దినోత్సవం హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆవిరి పడుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆవిరి పట్టుకోండి’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాయామం చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గాయని కౌసల్య తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘జీవితంలో ప్రతిరోజూ ఓ కొత్త ఆరంభమే.. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి’ అని చెప్పుకొచ్చింది.
యాంకర్ శివ జ్యోతి బతుకమ్మని ఎత్తుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శనార్థులు.. మంచిగా నా బతుకమ్మ పాటను పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడండి’ అంటూ బతుకమ్మ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ ‘నాకెంతో ఇష్టమైన వాళ్లు’ అంటూ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
గాయని అంజనా సౌమ్య తన కొడుకుతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ నటి మీనా ‘సామాజిక దూరం పాటిస్తున్నాను’ అంటూ షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
సింగర్ లిప్సిక ‘విలువైన ఫొటో’ అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ తార అమీషా పటేల్ మాస్క్ పెట్టుకున్నట్టుగా దిగిన జిఫ్ ఫొటోను పోస్ట్ చేసింది. దీనికి ‘బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి.. అందరికీ శుభ వారాంతం’ అని రాసుకొచ్చింది.
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కొడుకుతో సరదాగా వాకింగ్ చేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...