బాలీవుడ్ సుందరి బిపాసా బసు ఒక సోఫాలో నుంచి మరొక సోఫాలోకి జంప్ చేస్తున్నట్టుగా దిగిన జిఫ్ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘అద్భుతమైన సోమవారాల్లోకి అడుగుపెడుతున్నాం..’ అంటూ మిరాకిల్ మండే, ఆనందంగా ఉండండి అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాపు బొమ్మ, నటి స్నేహ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ నటి స్నేహతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అందాల భామ అనిత తను తల్లి కాబోతున్న విషయాన్ని ఇటీవలే అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘నాలుగు సార్లు నేను గర్భంతో ఉన్న విషయాన్ని ఫొటోల్లో కనిపించకుండా దాచగలిగాను. ఈ రకంగా మిమ్మల్ని ఫూల్ చేశాను.. స్వైప్ చేసి చూడండి’ అని రాసుకొచ్చింది.
అందాల భామ రాశీ ఖన్నా మత్స్య కన్యలా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రముఖ యాంకర్ సుమా కనకాల ‘త్రోబ్యాక్’ అంటూ క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార అమైరా దస్తూర్ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘గులాబీల్లానే నేనూ అందంగా ఉన్నా.. కాకపోతే నాకు కొన్ని ముళ్లు ఎక్కువగా ఉన్నాయి’ అనే కొటేషన్ ని జత చేసింది.
టాలీవుడ్ నటి వితిక తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎలాంటి సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉండేలా మీ మనసుకి శిక్షణనివ్వండి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ తార భూమీ పెడ్నేకర్ తన సినిమా ‘దుర్గావతి’కి డబ్బింగ్ చెబుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ అక్కినేని సమంత ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో కలిసి వ్యాయామం చేసిన వీడియోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార ఊర్వశీ రౌతెలా సోదరుడితో కలిసి డిన్నర్ చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూసేద్దామా...