స్టార్ యాంకర్ సుమా కనకాల మాస్క్‌ని తప్పనిసరిగా పెట్టుకుంటూ తోటివారిని కూడా మాస్క్ ధరించేలా చేస్తోంది. దానికి ఈ వీడియోనే నిదర్శనం. సుమ లిఫ్ట్‌లో ఉండగా ఒకతను మాస్క్‌తోనే లిఫ్ట్‌లోకి వచ్చినా ఫోన్ మాట్లాడడం కోసం మాస్క్‌ని తీసేశాడు. అది గమనించిన సుమ అతనిని సరిగా మాస్క్ ధరించమని సూచించింది.
శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మీ భవిష్యత్తు రహస్యం మీ రోజువారీ దినచర్యలోనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
గాయని లిప్సిక ‘బ్లాక్ లవ్’ అంటూ నల్లటి చీరలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
అందాల భామ తాప్సీ మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘అందమైన ప్రకృతిలోనే మంచి ఫిల్టర్, చక్కటి బ్యాక్‌గ్రౌండ్, సరైన లైటింగ్, చుట్టూ చక్కటి వస్తువులు ఉన్నప్పుడు మనం చేయాల్సిందల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టకుండా ఉండడమే’ అంటూ ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడానికి ఎలాంటి 'స్పెషల్ ఎఫెక్ట్స్' తోనూ పని లేదని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ‘తక్కువ అహం, ఎక్కువ కృతజ్ఞత’ అంటూ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన బాబుతో సాగర తీరాన సరదాగా గడిపిన వీడియోని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ భూమికా చావ్లా తన ఫొటోని పోస్ట్ చేసింది. ‘గతాన్ని గుర్తు చేసుకుంటూ.. వర్తమానంలో జీవిస్తూ.. భవిష్యత్తు కోసం కష్టపడుతూ.. అందరి కోసం ప్రార్థిస్తూ..’ అనే క్యాప్షన్ ను ఈ ఫొటోకు జత చేసింది.
టాలీవుడ్ భామ సమంత తన పెట్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘మానవత్వం గురించి నేర్పేవాళ్లంతా ఎప్పుడూ మనుషులే కానవసరం లేదు' అంటూ పెట్స్ కూడా మానవత్వాన్ని చాటుతాయని చెప్పకనే చెప్పిందీ భామ.
నటి లక్ష్మీ రాయ్ డిజైనర్ మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూద్దాం రండి...