టాలీవుడ్ భామ సమంత తమ పెళ్లి రోజు సందర్భంగా భర్త నాగచైతన్యతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నీకు నేను.. నాకు నువ్వు.. ఒకరికొకరం కష్టసుఖాలు ఏవైనా కలిసి పంచుకుందాం. ప్రియమైన శ్రీవారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ నాగచైతన్య ఖాతాని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌కు స్పందించిన పలువురు తారలు సమంత-నాగచైతన్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ యోగా చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ వారాన్ని ఊర్థ్వ హస్తాసనంతో మొదలుపెట్టాను. ఇది యోగాలో వార్మప్ లాంటిది. ఈ ఆసనం మనం ఇతర ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ ఊర్వశీ రౌతెలా ‘బ్లాక్ రోజ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలోని ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఈ కరోనా సమయంలోనే మొదలై పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’. ఇది టీం వర్క్‌తోనే సాధ్యమైంది’ అని తెలిపింది.
గాయని లిప్సిక రికార్డింగ్ రూమ్‌లో పాట పాడుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘పాటే నా బెస్ట్ ఫ్రెండ్’ అని రాసుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా ఒక రాయి మీద చేతులు, మరో రాయిపై కాళ్లు పెట్టి పుషప్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మహిళలుగా ముందు మనం శరీరం పై భాగాన్ని (అప్పర్ బాడీ) దృఢపరచుకోవాలి. మనం సాధన చేయకపోతే ముందుగా బలహీనపడేది అక్కడే.. అందుకే యోగా పుషప్స్ లో భాగంగా కాస్త క్రియేటివ్‌గా ప్రయత్నిస్తున్నా..' అంటూ డోంట్ గివ్ అప్, ఫిట్నెస్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
టాలీవుడ్ తార రష్మిక మందన తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఒకవేళ ప్రతి ఒక్కరూ తమ అంతః సౌందర్యాన్ని గుర్తించి, ఎలా ప్రేమించాలో తెలుసుకుంటే.. జీవించడానికి ఈ ప్రపంచం ఎంత బాగుంటుందో కదా’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
అందాల భామ ఇషితా దత్తా బీచ్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూద్దాం రండి...