టాలీవుడ్ నటి సమంత చీరలో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘మా డిజైనర్ ప్రీతం ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి. ఈ చీరంటే నాకు చాలా ఇష్టం. అందరికీ హ్యాపీ వీకెండ్...’ అని రాసుకొచ్చింది.
అందాల భామ తేజస్వీ మదివాడ సముద్రపు ఒడ్డున దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ‘మూడ్’ అంటూ గతంలో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. 'మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి' అనే హ్యాష్ టాగ్ దీనికి జత చేసింది.
అందాల తార అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ఓటీటి వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా అనుష్క తన అభిమానులతో వర్చువల్‌గా ముచ్చటించింది. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ‘న్యూ నార్మల్’ అంటూ సెట్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి భూమికా చావ్లా తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ సుందరి రేణూ దేశాయ్ ‘ఆనందంగా ఉండడమే మంచి మేకప్’ అంటూ చిరునవ్వులు చిందిస్తోన్న తన ఫొటోని పోస్ట్ చేసింది.
‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ తన భర్తతో దిగిన ఫొటోలను పంచుకుంది. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే మై ఫేవరెట్' అంటూ భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. 'ఆకలేసినప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా'.. అంటూ సరదాగా రాసుకొచ్చింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హిందీ పాటకి స్టెప్పులేసిన వీడియోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కొంతమంది నేను పెళ్లి చూపులకు రడీ అయ్యానని అనుకుంటారు. కానీ నా వరకు నేను అందంగా ఉన్నాను అంతే’ అని చెప్పుకొచ్చింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల పుస్తకం చదువుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు అందాల తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...