‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ ‘ఎప్పటికీ ఛాయిస్ మీదే’ అంటూ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది.
అందాల భామ కియారా అడ్వాణీ గన్‌తో షూట్ చేస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తన తల్లితో దిగిన చిన్నప్పటి ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఒక్క ఫొటో వెయ్యి మాటలు తెలియజేస్తుంది.. కానీ ఈ ఫొటో నా తల్లి నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు గుర్తు చేస్తుంది.. నాకు గొప్ప గురువు, థెరపిస్ట్, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ అమ్మే. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అమ్మా.. లవ్ యూ’ అంటూ తల్లిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది.
‘రౌడీ బేబీ’ సాయి పల్లవి పచ్చని కొండల దగ్గర అందమైన గార్డెన్లో కూర్చున్న తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ ‘వింటేజ్ వైబ్స్’ అంటూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా తన పెట్ బ్రూనోతో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ దానికి బర్త్ డే విషెస్ తెలిపింది.
బాలీవుడ్ సుందరి సోనాలీ బింద్రే ‘అంతర్జాతీయ కాఫీ దినోత్సవం’ సందర్భంగా కాఫీ కప్ పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది.
స్వర్గీయ శివాజీ గణేశన్, అల్లు రామలింగయ్యల జయంతి సందర్భంగా నటి మీనా వారిని గుర్తు చేసుకుంటూ వారి ఫొటోలను పోస్ట్ చేసింది. ‘లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ చేత నేను సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనందుకు నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ రోజు ఆ మహానుభావుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను స్మరించుకుందాం’ అని పోస్ట్ చేసింది. మరో పోస్ట్‌లో ‘మరో లెజెండ్ అల్లు రామలింగయ్య గారితో చాలా సినిమాల్లో నటించడం నా అదృష్టం. ఆయన ఎప్పుడూ పాపా అంటూ నన్ను ఆటపట్టించేవారు’ అని చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ ఓ ముసలి రైతు నిద్రపోతున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘జీవితంలో ఏదో ఒక రోజు మనకు డాక్టర్, లాయర్, పోలీస్‌ల అవసరం ఉంటుంది. కానీ ప్రతి రోజూ, మూడు పూటలూ మనకు రైతు కావాలి. అవును.. ఈ రోజు రైతుల దినోత్సవం కాదు.. అయినా మనం గౌరవం చూపించవచ్చు’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ నివేదా పేతురాజ్ ఆకాశంలోని నక్షత్రాలను తన కెమెరాలో బంధించింది. ఈ సందర్భంగా ‘చీకటి లేనిది ఆకాశంలోని నక్షత్రాలను చూడలేం కదా’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార కంగనా రనౌత్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ప్రియమైన స్నేహితులారా.. ఈ రోజు నాకు ప్రత్యేకమైనది. ఏడు నెలల తర్వాత షూటింగ్‌కి హాజరయ్యాను. ద్విభాషా చిత్రమైన ‘తలైవి’ చిత్రం కోసం సౌత్ ఇండియాకు చేరుకున్నాను. ఇలాంటి విపత్కర (కరోనా) సమయంలో మీ ఆశీస్సులు ఎంతో అవసరం’ అంటూ రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...