టాలీవుడ్ భామ రేణూ దేశాయ్ రోమియో అనే గుర్రంతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘గుర్రాలలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. నేను 12 ఏళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. గుర్రాలు ఎంత తెలివైనవో, ఎంత త్వరగా పరిస్థితులను అర్థం చేసుకుంటాయో నాకు తెలుసు. 2015లో నేను బరువు పెరిగి అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలోనే గుర్రపు స్వారీని ఆపేశాను. తొందరగా బరువు తగ్గి మళ్లీ నా రోమియోతో అనుబంధం పెంచుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.
‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఆచ్... అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి షూటింగ్‌కి హాజరయ్యాను. ఈ టెస్ట్ చేసినంత సేపు భయపడ్డా. ముక్కులోంచి స్వాబ్ తీసుకునే సమయంలో 5 సెకన్ల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. హమ్మయ్య పని పూర్తయింది. అదృష్టవశాత్తూ నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. అందరూ తప్పకుండా ఆరడుగుల భౌతిక దూరం పాటించండి’ అంటూ రాసుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ నవ్వులు రువ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘బాగా నవ్వండి.. ఎందుకంటే నవ్వడం వల్ల ఎలాంటి ఖర్చు ఉండదు.. లాఫింగ్ లైన్స్!’ అని రాసుకొచ్చింది.
సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా మంచు కొండల్లో దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇప్పుడున్న వేడి నా స్కీయింగ్ ట్రిప్స్‌ని గుర్తుచేస్తోంది. శీతాకాలం కోసం వేచి ఉండలేకపోతున్నా..’ అని రాసుకొచ్చింది.
అందాల నటి భూమికా చావ్లా తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘శక్తికి వ్యాపించే గుణం ఎక్కువ. మనం ఏ శక్తి (పాజిటివ్/నెగెటివ్) చుట్టూ తిరుగుతుంటామో.. చివరికి దాన్నే గ్రహించడం ప్రారంభిస్తాం. కాబట్టి ఏదైనా నిర్ణయం మీదే!’ అంటోంది.
బుల్లితెర నటి సుజితా ధనుష్ షూటింగ్ స్పాట్లో దిగిన తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
డ్యాన్సర్ దీప్తీ సునైన తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మంచో, చెడో మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక వ్యక్తి మీకు ఏదో ఒక పాఠం నేర్పుతారు’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..