
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇది మీ బుర్రకు పదునుపెట్టే సమయం. ఈ ఫొటోలో ఏడుగురు మనుషులు, ఒక పిల్లి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి. మీరు కనిపెట్టినట్లయితే మీ మెదడు బాగా పని చేస్తోందని అర్థం.. ఒకవేళ అయిదుగురి కంటే తక్కువ మందిని మాత్రమే కనిపెట్టగలిగితే ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని తిరిగి తాజాగా ప్రయత్నించండి’ అని చెప్పుకొచ్చింది.
సింగర్ లిప్సిక తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎలాంటి సందర్భంలోనూ భయపడకండి.. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘటన అయితే అనుభవాన్ని లేకపోతే గుణపాఠాన్ని నేర్పుతుంది. రెండు విధాలుగా మనకే మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి దియా మీర్జా ఉసిరికాయలతో నిండిన బాక్స్ పట్టుకొని దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీకు తెలుసా.. ఇండియాలో ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని రెండూ చూసుకునే క్రమంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అంతేకాదు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఉసిరికాయలను తీసుకోవడం చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకొందాం’ అని చెప్పుకొచ్చింది.
యాంకర్ సుమా కనకాల తన మేనకోడలు రాగలీనకు భోజనం వడ్డించింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కాకరకాయల గురించి ఫన్నీ సంభాషణ జరిగింది. సుమ ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది. ఆ ఫన్నీ డిస్కషన్ని మీరూ చూసేయండి మరి..
కేరళ కుట్టి సాయి పల్లవి ప్రకృతి సోయగాల నడుమ దిగిన తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల తార సాయేషా సైగల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార అదా శర్మ ఫిట్నెస్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోనే దీనికి ఉదాహరణ. ఈ వీడియోలో తల వెనక నుంచి చేతులను నేలపై ఆన్చి కొద్దిదూరం నడిచింది. ఇంకెందుకాలస్యం.. ఆ వీడియోను చూసేయండి మరి...
బాలీవుడ్ ముద్దుగుమ్మ షమితా షెట్టి షూటింగ్ సందర్భంగా తన తోటి నటీనటులతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
గోవా బ్యూటీ ఇలియానా నదిలో సరదాగా షికారు చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...