టాలీవుడ్ సుందరి రష్మిక పళ్ళు కనిపించేలా నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. 'తమకు తెలియని వ్యక్తులెవరైనా తమను చూసి నవ్వినప్పుడు కొంతమంది విచిత్రంగా చూస్తారు.. లేదా అలా నవ్వేవారికి పిచ్చి అనుకుంటారు.. మీరు కూడా అలాగే అనుకునేటట్లయితే మీరు నా ఫ్రెండ్ కాదు.. ఎందుకంటే నేను కూడా అలాంటి అపరిచితురాలినే.. ఎవరిని చూసినా నా స్టైల్ లో నేను నవ్వేస్తుంటాను..' అంటూ కోతి ఎమోజీ జత చేసిందీ భామ.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా వ్యాయామం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సంతోషం అంటే మనకు కావాల్సినవి పొందడం కాదు.. మనకు ఉన్నవాటిని ఆస్వాదించడం’ అంటూ నిజమైన ఆనందం అంటే ఏంటో చెప్పిందీ సుందరి.
యాంకర్ ఝాన్సీ తన తల్లితో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేశారు. 'ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నా.. అమ్మతో కలిసి దిగిన ఫొటోని పంచుకోవడానికి ‘మదర్స్ డే’ ఒక్కటే అవ్వాల్సిన అవసరం ఉందా?’ అంటూ అమ్మ, కొవిడ్ కి ముందు అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు.
సింగర్ గీతా మాధురి తన భర్త నందుతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి మెహరీన్ చిరునవ్వు చిందిస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘జీవితం అద్దం లాంటిది.. మనం నవ్వుతుంటే అది కూడా నవ్వుతుంది' అని చెప్పుకొచ్చింది.
గాయని లిప్సిక మరో గాయని చిన్మయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
‘ప్రేమమ్’ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కళ్లు మూసుకొని నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నాకు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నవ్వే వాళ్లంటే ఇష్టం’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ సుందరి శ్రియా శరణ్ ‘గమనం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది ఆ చిత్రబృందం. అదే పోస్టర్ని తను కూడా తన అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా కొంతమంది మహిళలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. 'ప్రతి ఉద్యోగిని వెనక ఎంతోమంది పని చేసే మహిళలు ఉంటారు.. మీరు లేకుండా ఏదీ సాధ్యం కాదు.. కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చిందీ భామ.
'కొన్ని సందర్భాలను అవి జ్ఞాపకాలుగా మారేంతవరకు మనం పట్టించుకోము' అంటూ అందాల తార నిషా అగర్వాల్ తన కుటుంబంతో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. 'ఈ జ్ఞాపకం కూడా అలాంటిదే. ఈ ఫొటో గోవా ట్రిప్‌లో దిగింది. నేను, కరణ్, ఇషాన్‌లు మాత్రమే ఉన్నాం.. నేను చేసిన విహారయాత్రల్లో ఇది ఎంతో మధురమైనది.. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకం ఏదైనా ఉంటే నాతో పంచుకోండి’ అని చెబుతోందీ భామ.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...