నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల భామ పార్వతీ నాయర్ చీరకట్టులో మెరిసిపోతోన్న ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘ఇండియాలో ఉన్నప్పుడు సీజన్లతో పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరమంతా వేడిగానే ఉంటుంది. కాబట్టి ఫ్లోరల్స్ ధరించడానికి స్ప్రింగ్ సీజన్ కోసం వేచి చూడకండి. నాకు చీరలంటే అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజూ చీర కట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటాను. మరి మీరు కూడా అంతేనా?’ అంటూ అభిమానులను అడుగుతోందీ తార.
మెగా కోడలు ఉపాసన తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘నేను శక్తిమంతురాలిననిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని అలా ఉండమని కోరుతోంది'.. అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ తార మల్లికా శెరావత్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ 'ప్రతి సూర్యోదయం మన జీవితాన్ని మార్చుకోవడానికి లభించిన మరో సువర్ణావకాశమే’ అని చెప్పుకొచ్చింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘జీవితంలో మీకు ఎదురైన సమస్యలకు కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే అవే మిమ్మల్ని మరింత శక్తిమంతులుగా, తెలివిగలవారిగా, వినయశీలురుగా మారుస్తాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకండి.. మిమ్మల్ని మీరు మరింత దృఢంగా మార్చుకోండి..' అంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ భామ ప్రియమణి ‘ఓనమ్’ సందర్భంగా దిగిన మరికొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
మాటల మరాఠీ, యాంకర్ సుమా కనకాల సూర్యోదయపు వెలుగులో నిలబడి మాట్లాడుతోన్న వీడియోని పోస్ట్ చేసింది. ‘మన ఫోన్ పని చేయాలంటే ప్రతి రోజూ ఛార్జింగ్ అవసరం.. అలాగే మన శరీరానికి కూడా ఛార్జింగ్ కావాలి. మరి, అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా.. సూర్యకిరణాల నుంచి.. మన శరీరానికి ఎండ తగలకపోతే సమతౌల్యం దెబ్బతింటుంది.. అందుకే రోజూ కొద్దిసేపు ఎండ తగలనివ్వండి..' అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.
కన్నడ బ్యూటీ నందితా శ్వేత తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులనే ధరించండి’ అని చెప్పుకొచ్చింది.
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కిరీటం పెట్టుకుని కృష్ణుడి గెటప్ లో ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. యాక్టర్ నందూ విజయ క్రిష్ణ పోతురాజుగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్' లోని స్టిల్ ఇది. ఫొటో పైన క్యాప్షన్ బట్టి ఇందులో రష్మి నందూ లవర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సుందరి రష్మిక మందన ‘మై లవ్’ అంటూ ఓ పాపతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సింగర్ లిప్సిక ‘త్రోబ్యాక్’ అంటూ గతంలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తేజస్వి, అమైరా దస్తూర్, రుహానీ శర్మ, ప్రణీతా సుభాష్, శ్రీదేవి విజయ్‌కుమార్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై ఓ లుక్కేద్దాం రండి...