నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ పచ్చని కొండల్లో, సెలయేటి నుంచి జారిపడుతోన్న నీళ్లను కెమెరాలో బంధించింది. ఆ ఫొటోని షేర్ చేస్తూ ‘నా గ్యాలరీ నన్ను నేను అసూయపడేలా చేస్తోంది. గతంలో నేను ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు లేవు.. కరోనా డార్లింగ్ దయచేసి వెళ్లిపో!’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
అందాల భామ శ్రీముఖి ‘ఓ ఉమేనియా’’ అంటూ వివిధ గెటప్స్ లో ఉన్న పోస్టర్ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఓ ఉమేనియా’ అతి త్వరలో..’ అంటూ ఆల్ ఎబౌట్ ఉమన్ అనే క్యాప్షన్‌ని జోడించింది.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మలైకా అరోరాతో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మలైకాకి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త విని చాలా బాధపడ్డా. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా. తను క్షేమంగా ఉందని ఆశిస్తున్నాను. నువ్వు తొందరగా కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నా మాలా’ అని రాసుకొచ్చిందీ భామ.
దక్షిణాది తార నిత్యామేనన్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను పోస్ట్ చేసింది.
టీవీ ఆర్టిస్ట్ సుజితా ధనుష్ తన సోదరుడితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్-4 కంటెస్టెంట్ గా ఉన్న తన సోదరుడు సూర్యకిరణ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
టాలీవుడ్ భామ నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితార క్రిస్టల్ బాల్ ముందు కూర్చొన్న ఫొటోలను పోస్ట్ చేసింది.
మెగా డాటర్ నిహారికా కొణిదెల మిర్రర్ సెల్ఫీ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది తార కుష్బూ అందమైన చీర ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ చీరని నేను సుహాసిని వాళ్ల అమ్మగారి వార్డ్రోబ్ నుంచి తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ మంచు లక్ష్మి తన కూతురితో సరదాగా గడుపుతోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘గీతాంజలి’ భామ అంజలి ‘వింక్ సిరీస్’ అంటూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు అందాల తారలు తేజస్వి, సారా అలీ ఖాన్, ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, శ్రద్ధా దాస్, హంసా నందినీలు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. వాటిని చూసేద్దామా..?