scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నాకు సంతోషం కలిగించేది ఏంటో తెలుసా?

Latest posts of Celebrities in Instagram

instastrip3.png

నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
మిల్కీ బ్యూటీ తమన్నా, సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సద్గురుకు జన్మదిన శుభాకాంక్షలు.. నదుల సంరక్షణ కోసం 'కావేరి పిలుస్తోంది' ఉద్యమం ప్రారంభమై నేటికి సంవత్సరమైంది. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ముందు తరాల కోసం 'ఈషా ఫౌండేషన్‌' చేస్తోన్న కృషి మరువలేనిది. దానిలో నేను కూడా భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onఅందాల భామ హంసా నందిని నవ్వుతోన్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నాకు సంతోషాన్ని కలిగించేదేంటో మీరు ఊహించగలరా?’ అంటూ అభిమానులను అడుగుతోందీ భామ.

View this post on Instagram

A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) onఅందాల భామ హన్సిక ‘త్రోబ్యాక్‌ ’ అంటూ కాఫీ కప్పు పట్టుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఉదయాన్నే కావాల్సిన కనీస అవసరాలు ఏంటంటే.. బెల్‌ బాటమ్స్‌, కాఫీ, హ్యాండ్‌ బ్యాగ్, ఇంకా నమ్మకం’ అని చెప్పుకొచ్చిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) onటాలీవుడ్‌ నటి, నిర్మాత మంచు లక్ష్మి గతంలో దక్షిణాఫ్రికా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఇవి నేను మొదటిసారి దక్షిణాఫ్రికాకు వెళ్లిన జ్ఞాపకాలు. ఇప్పటివరకు చూడని ప్రదేశాలను చూసేందుకు ఇంక ఆగలేకపోతున్నా.. ప్రకృతి, కుటుంబం, స్నేహితులు.. ఇంతకంటే మంచి ట్రావెల్‌ స్టోరీని నేను చూడలేదు’ అని రాసుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onబాలీవుడ్‌ సుందరి ప్రియాంకా చోప్రా ‘వేసవి చివరి కొన్ని రోజులు’ అంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ప్రియాంక కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ వేసవి కాలం ఇటీవలే పూర్తైంది.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onబాలీవుడ్‌ భామ సోఫీ చౌదరి చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మీ చిరునవ్వుతో ప్రపంచాన్ని మార్చండి.. అంతేకానీ ప్రపంచం మిమ్మల్ని మార్చేలా చేసుకోకండి’ అంటూ చెప్పుకొచ్చిందీ భామ.

View this post on Instagram

A post shared by SOPHIE (@sophiechoudry) onబాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘మన నిర్ణయాలు మన ఆశలను ప్రతిబింబించాలి కానీ, భయాలను కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Dia Mirza (@diamirzaofficial) onకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలువురు తారలు మొక్కలు నాటుతూ తమ తోటి తారలను కూడా నాటమని ఛాలెంజ్‌ విసురుతున్నారు. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో చేరింది. తను మొక్కలు నాటుతోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) onవీరితో పాటు అందాల తారలు రష్మిక, మలైకా అరోరా, శివాత్మిక, సారా అలీ ఖాన్‌, తేజస్వీ, హెబ్బా పటేల్‌, రుహానీ శర్మలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓ సారి చూద్దాం రండి..

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on


View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) on


View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


View this post on Instagram

A post shared by Tejaswi Madivada🧿 (@tejaswimadivada) on


View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp) on


View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram