పలువురు తారలు నేడు జన్మదిన వేడుకలను జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాపురమంతా పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోయింది. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక, మధుప్రియ, అంజలి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నటి జీవితను తన కుమార్తె శివాత్మిక విష్ చేయగా.. మరో నటి మీనా తన సహనటుడు కిచ్చా సుదీప్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. బాలీవుడ్ భామ సన్నీ లియోన్ తన ఆంటీ బర్త్‌డే కోసం ఏకంగా పెయింటింగే వేసింది. ఆ విశేషాలు చూద్దాం రండి...
నటి శివాత్మిక తన తల్లితో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మమ్మీ, ఐ లవ్ యూ’ అంటూ ‘మై హోల్ హార్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.
అందాల నటి మీనా తన సహనటుడు కిచ్చా సుదీప్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
బాలీవుడ్ సుందరి సన్నీ లియోన్ తన పిల్లలతో కలిసి పెయింటింగ్ వేస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నేను, నిషా, నోహ్, ఆషేర్ నలుగురం కలిసి వారాంతంలో ఆరు పెయింటింగ్స్ వేశాం. ఫొటోలో ఉన్న పెయింటింగ్‌ని నిషా సహాయంతో నేనే వేశాను. ఈ పెయింటింగ్‌ని మా మార్సీ ఆంటీ పుట్టిన రోజు గిఫ్ట్ట్ కోసం వేశాను. హ్యాపీ బర్త్ డే! వుయ్ లవ్ యూ సో మచ్!’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
ప్రముఖ యాంకర్ సుమా కనకాల అందమైన చీర కట్టుకొన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నేను 10వ తరగతిలో ఓ నాటకం వేసినప్పుడు మొదటి సారి చీర కట్టాను. చీరలపై ఉన్న మమకారం అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉంది’ అంటూ చీరలపై తనకున్న ఇష్టాన్ని తెలిపింది.
టాలీవుడ్ భామ కామ్నా జెఠ్మలానీ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి’ అని చెబుతోంది.
అందాల భామ భానుశ్రీ ఎరుపు రంగు డ్రస్సులో అందంగా ముస్తాబైన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అందమంటే చూపుల్లోనూ, మాటల్లోనూ ఉండదు. వారికి వారుగా ఉండడమే నిజమైన అందం’ అని అందం గురించి వివరించిందీ భామ.
‘కంచె’ భామ ప్రగ్యా జైస్వాల్ వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గణేషుడిని పట్టుకొని దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే సూర్యాస్తమయ వెలుగులో దిగిన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఒకవేళ మీ చుట్టూ అంతా చీకటితో కమ్మేసి ఉంటే.. మరొకసారి నిశితంగా చూడండి.. మీరే ఒక వెలుగులా కనిపిస్తుంటారు’ అని రాసుకొచ్చింది.
అందాల నటి ఖుష్బూ వ్యాయామం చేసిన తర్వాత దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
యోగా సుందరి శిల్పా శెట్టి ‘క్లీన్ బౌల్డ్’ అంటూ పిన్ బౌలింగ్ చేసిన వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు అందాల భామలు ఇషితా దత్తా, హంసా నందిని, దిశా పటానీ, ప్రియమణి, నిధి అగర్వాల్‌లు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు.. వాటిని చూద్దాం రండి..