నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
ప్రముఖ హీరోయిన్ మీనా తన ఫిష్ పాట్లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందిస్తూ ‘వావ్.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రతి ఒక్కరిపై కరుణ చూపించండి’ అని రాసుకొచ్చింది.
తెలుగు యాంకర్ శ్రీముఖి ‘వావ్’ కార్యక్రమం సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘మహానటి’ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సుందరి సారా అలీ ఖాన్ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ వినాయకుడికి దండం పెడుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా తన ఆఫీసులో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ సైకిల్ తొక్కుతున్న ఫొటోని పోస్ట్ చేస్తూ ‘సైకిల్ తొక్కడం, జీవితం ఒక్కటే.. ఎందుకంటే కిందపడకుండా ఉండాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి’ అని రాసుకొచ్చింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే యోగా చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల గురించి చింతించకండి’ అంటూ జస్ట్ సేయింగ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.
వీరితో పాటు అందాల తారలు రాశీ ఖన్నా, లాస్యా మంజునాథ్, అను ఇమ్మాన్యుయేల్, నభా నటేష్, శ్రద్ధా దాస్, ఈషా గుప్తా, వితిక, అనుపమా పరమేశ్వరన్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...