నేటి ఇన్స్టాపురం విశేషాలు...
అందాల భామ బిపాసా బసు తన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఆత్మవిశ్వాసం ఒక సూపర్ పవర్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెడతారో అప్పుడు ఒక మ్యాజిక్ మొదలవుతుంది’ అంటూ అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందీ భామ.
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ‘వావ్’ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇతరుల అంగీకారం కోసం జీవించడం మానేసి.. మీకు మీరే నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘కుటుంబ సభ్యులతో గడపడం ఎప్పుడూ ఒక వరమే. ఇక ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ సభ్యులను కలిసినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించలేం. ఈ ‘వినాయక చవితి’ సందర్భంగా మంచు ఫ్యామిలీ మరోసారి ఒక్కటైంది. ఆ గణేషుడి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ 2007లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల నటి ఖుష్బూ తన మొదటి చిత్రం.. మొదటి రోజు షూటింగ్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తను నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జీవితం అంటే మూంగ్దాల్, సోన్పాపిడీల మిశ్రమం’ అని చెప్పుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ తన స్నేహితులతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు... నాకు తోడుగా ఉండే బృందం ఇదే’ అంటూ ఈ బృందంలో కరిష్మా కపూర్ మిస్సయ్యిందని గుర్తు చేసిందీ భామ.
‘గుంజన్ సక్సేనా’ భామ జాన్వీ కపూర్ ఆ చిత్ర షూటింగ్లో భాగంగా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘గుంజు కోసం చివరి రోజు.. చివరి సీన్’ అని రాసుకొచ్చిందీ భామ.
నటి ప్రగతి తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా ‘‘బంటీ ఔర్ బబ్లీ’ చిత్రంలోని ‘కజ్రారే’ పాటకి కొన్ని స్టెప్పులేసింది’. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘ప్రతిరోజూ మీకు ఆనందాన్నిచ్చే పనిని చేయండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.
అందాల తార రేణూ దేశాయ్ తన ఫోన్ చూస్తూ నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మనకు నచ్చిన వారి నుంచి ఒక్క మెసేజ్ వచ్చినా.. మన ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగిపోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
నటి భానుశ్రీ తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీకు మీరుగా ఉండడమే స్వచ్ఛమైన అందం’ అని చెప్పుకొచ్చింది.
ఆగస్టు 26న ‘ఇంటర్నేషనల్ డాగ్ డే’ గా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు తారలు తమ పెట్స్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలని ఓసారి చూద్దాం రండి...
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..