నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన ఒక అమ్మాయిని ఎత్తుకొని నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఎవరైతే ప్రేమను ఆస్వాదించగలుగుతారో.. వారి చిరునవ్వులో ఓ మ్యాజిక్ ఉంటుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
నటి ప్రగతి ఇతరులతో కలిసి పొలం పని చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘విత్తనం వేసిన రోజే పంట చేతికి రాదు.. ప్రతిదానికీ ఓపిక అవసరం’ అని క్యాప్షన్ ఇచ్చింది.
అందాల భామ భూమి పెడ్నేకర్ మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ‘మీరు నిజంగా కేర్ చేస్తుంటే దయచేసి తప్పనిసరిగా మాస్క్‌ని ధరించండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. తక్కినవన్నీ అవే దారిలోకి వస్తాయి’ అంటూ లవ్, మై సెల్ఫ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ భామ.
అందాల భామ మంచు లక్ష్మి వివిధ అవుట్ఫిట్లలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘గుంజన్ సక్సేనా’ భామ జాన్వీ కపూర్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో జాన్వీ పక్కన కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ‘గత వారం నుంచి పెయింటర్ కావాలని ప్రయత్నిస్తున్నాను’ అని అంటోందీ భామ.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ షూటింగ్లో భాగంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మరొక రోజు.. మరో షూటింగ్.. నా సైన్యం.. పూనీ నిన్ను మిస్సవుతున్నా’ అంటూ తన ఫీలింగ్స్ వ్యక్తం చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. ‘డ్యాన్స్ చేస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది.. నాకు ఇష్టమైన కాలక్షేపం ఇదే’ అంటూ ‘ఇప్పుడే మొదలుపెట్టకండి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందీ స్వీట్ డాటర్.
బిగ్‌బాస్’ బ్యూటీ, డ్యాన్సర్ దీప్తీ సునైనా తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘నాకు వ్యతిరేకంగా ఏం చేసినా అది ముందుకు సాగదు’ అంటూ తన పేరునే హ్యాష్ట్యాగ్గా రాసుకొచ్చిందీ భామ.
ప్రముఖ యాంకర్ సుమా కనకాల తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘హే.. నేను చూస్తోన్న దానిని మీరు చూస్తున్నారా? భౌతికంగా చూసినప్పుడు సమాధానం అవును కావచ్చు. కానీ మానసికంగా ఎవరి దృష్టితో వారు చూస్తారు. సో, ఈ రోజు నాకు అందమైన రోజు. మరి మీకు?’ అంటూ రాసుకొచ్చిందీ మాటల మరాఠీ.
మెగా కోడలు ఉపాసన సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘వర్క్ ఫ్రం హోమ్, హోమ్ వర్క్ రెండూ ఒక్కటేనా? ఆఫీసుని మిస్ అవుతున్నాను.. కానీ ఇది కూడా చేయాలిగా?’ అని రాసుకొచ్చిందీ భామ.
వీరితో పాటు అందాల తారలు శ్రద్ధా దాస్, భానుశ్రీ, మౌనీ రాయ్, అదా శర్మ, రష్మీ, తాప్సీ, మల్లికా శెరావత్లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...