నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల తార సమంత క్యారట్లను పట్టుకొని దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ వారం మెనూ.. క్యారట్ జ్యూస్, క్యారట్ పచ్చడి, క్యారట్ హల్వా, క్యారట్ ఫ్రై, క్యారట్ పకోడి, క్యారట్ ఇడ్లీ, క్యారట్ సమోసా’ అంటూ ‘గ్రో విత్ మి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందీ భామ. ఈ క్యారట్లను సమంతే స్వయంగా తన గార్డెన్లో పండించింది.
డ్యాన్సర్ దీప్తీ సునైనా ‘హాయ్.....’ అంటూ తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ అనుపమా పరమేశ్వరన్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ‘మనసుకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు బాధపడుతూ కూర్చోకండి.. మళ్ళీ మీ జీవితంలో వెలుగులు చూడడానికి ఎంతో దూరం లేదని గుర్తించండి..’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేసింది. 'ఈ ఫొటోని చూసినప్పుడల్లా ఎంత బాధ కలుగుతుందో చెప్పలేను.. నవ్వు, కన్నీళ్లు ఒకేసారి వస్తాయి' అంటూ ఫ్రీ స్పిరిట్, ఇన్నొసెన్స్ హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసిందీ యాంకర్.
నటి భానుశ్రీ తన తాజా ఫొటోలను పోస్ట్ చేసింది. ‘అక్కర్లేదనుకుంటే దృఢమైన మహిళ దాని వైపు చూడదు.. బతిమాలదు.. దూరంగా వెళ్లిపోతుందంతే...' అని రాసుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ పుస్తకం పట్టుకుని నిద్రపోతున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘పుస్తకం చదువుతూ అలానే నిద్రపోయాను.. అది గమనించిన నా మేనల్లుడు ఫోన్లో బంధించాడు’ అని చెప్పుకొచ్చిందీ భామ.
నటి మౌనీ రాయ్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ షేక్స్‌స్పియర్ కొటేషన్‌ని పోస్ట్ చేసింది. ‘అందరినీ ప్రేమించండి.. కొందరిని నమ్మండి.. కానీ ఎవరి విషయంలోనూ తప్పు చేయకండి..’ అని రాసుకొచ్చిందీ భామ.
‘అందాల రాక్షసి’ లావణ్యా త్రిపాఠి మొక్కలు నాటుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇంత మంచి ఛాలెంజ్‌కి నన్ను నామినేట్ చేసిన నందినీ రెడ్డికి కృతజ్ఞతలు.. ఈ ఛాలెంజ్ కోసం నేను, నా సోదరుడు కలిసి మరికొంతమంది సహాయం అడిగాం. వారు గొప్ప మనుసుతో అంగీకరించారు. మేమందరం కలిసి 50 మొక్కలను నాటాం’ అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసింది. అంతేకాదు.. రితూవర్మ, కార్తికేయ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్, అనితా రెడ్డిలను నామినేట్ చేసిందీ సుందరి.
బాలీవుడ్ భామ కరీనా కపూర్ ‘త్రో బ్యాక్’ అంటూ షూటింగ్లో భాగంగా దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు అందాల భామలు హిమజ, ఖుష్బూ, అదా శర్మ, పూజా హెగ్డే, భూమీ పెడ్నేకర్, వర్షిణి, హెబ్బా పటేల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...