నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
యాంకర్ ఝాన్సీ ‘నేను.. నా నవ్వు.. దిల్ సే’ అంటూ నవ్వుతోన్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి ప్రగతి తన సహచర నటితో నవ్వుతోన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
నటి నమ్రత తన భర్త, కూతురు నవ్వుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘నవ్వడానికి కారణం అవసరం లేదు’ అనే క్యాప్షన్‌ని జత చేసింది.
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మరో తార అనుష్కా శర్మతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని తన కూతురు పెట్‌తో ఆడుకుంటోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీకో విషయం తెలుసా.. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి పెట్స్ ఎంతో సహాయపడతాయి. ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా జీవించేలా అవి మనకు సహకరిస్తాయి. అలాగే అమితమైన ప్రేమతో మనల్ని ఆనందంగా, సానుకూలంగా ఉండేలా చేస్తాయి’ అని రాసుకొచ్చిందీ సిస్టర్.
కొత్త పెళ్లి కూతురు, దగ్గుబాటి వారి కోడలు మిహీకా బజాజ్ విభిన్న అవుట్ ఫిట్లలో దిగిన ఫొటోలని కొలేజ్ చేసి పోస్ట్ చేసింది.
అందాల భామ ఊర్వశి రౌతెల మొక్కని నాటుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రభాస్, మహేష్ బాబు, తమిళ తలపతి విజయ్‌లకు ధన్యవాదాలు. నా అభిమానులందరినీ నేను నామినేట్ చేస్తున్నాను. ఈ చెయిన్‌ని ఇలాగే కొనసాగించి సరిహద్దులను దాటనివ్వండి. అందరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. గ్రీన్ వరల్డ్‌కి ఇదొక ముందడుగు’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఫొటోలని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మీరు అందరిలాగా దుస్తులు ధరించనప్పుడు.. అందరిలాగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు’ అని చెప్పుకొచ్చిందీ భామ.
నటి, నిర్మాత మంచు లక్ష్మి రైల్వే ట్రాక్‌పై దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘అవుట్డోర్ షూటింగ్‌లంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఆ జ్ఞాపకాలకు నా గుండెలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ వారం అందులోని ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను’ అని రాసుకొచ్చిందీ భామ.
వీరితో పాటు అందాల తారలు నిహారిక, సన్నీ లియోనీ, భాను శ్రీ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా దాస్, లాస్య, సారా అలీ ఖాన్, కాజల్ అగర్వాల్‌లు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. మరి, ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి...