నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల తార నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితార డ్యాన్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ రష్మీ గౌతమ్ ‘ఇంకి పింకి పాంకీ’ అంటూ పింక్ డ్రస్ ధరించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గాయని మధుప్రియ ఆ విగ్రహాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ‘ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాన్ని పంపించినందుకు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు.. ఇదొక మంచి కార్యక్రమం కోసం చేస్తోన్న మంచి ప్రయత్నం’ అని చెప్పుకొచ్చిందీ సింగర్.
అందాల తార ప్రణీత తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ అవుట్‌ఫిట్‌లో ఇదే నా చివరి ఫొటో’ అని రాసుకొచ్చిందీ భామ.
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ‘న్యూ నార్మల్’ అంటూ మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ తన ఫొటోలను పోస్ట్ చేసింది. ‘ఈ లాక్డౌన్ సమయాన్ని శారీరకంగా, ఆధ్యాత్మికంగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి కేటాయించాను.. అతిగా తినకుండా ఉండడానికి.. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి..' అని రాసుకొచ్చిందీ సుందరి.
‘Rx 100’ భామ పాయల్ రాజ్‌పుత్ కెమెరా పట్టుకొని ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీనికి ‘మమ్నల్ని వాళ్ల లెన్స్‌లతో మరింత అందంగా చూపించే ఫొటోగ్రాఫర్లకు ఈ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని అంకితమిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ భామ. ఆగస్టు 19వ తేదీని ‘ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు.
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా పచ్చని ప్రకృతి నడుమ దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘2020కి ముందు నుంచే నేను సామాజిక దూరాన్ని పాటిస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ సుందరి.
ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ తన కంటికి ప్లాస్టర్ వేసిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘నేను నా భర్తను ఎక్కువ సేపు చూస్తున్నానో లేక నన్ను ఎవరైనా ఎక్కువ సేపు చూస్తున్నారో గానీ నా కంటికి గాయమైంది (ఫన్నీ ఎమోజీలు). ఈ ఉదయం చికిత్స చేయించుకున్నాను.. కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది’ అని చెప్పారు.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తను లాకప్‌లో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. ఈ ఫొటోపై ‘వినాయక చవితి పండుగ రోజు ఉదయం 9:00 గం.లకు మీ ఈటీవీలో’ అని రాసి ఉంది. మరి వారిద్దరూ లాకప్‌లో ఎందుకు ఉన్నారో తెలియాలంటే వినాయక చవితి రోజు ఈటీవీ కార్యక్రమాన్ని చూసేయండి మరి...
హీరోయిన్ సాయేషా సైగల్ ఓ కార్యక్రమం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇది గతంలో ఓ షో కోసం రిహార్సల్ చేసిన వీడియో.. ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇవ్వడమనేది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.. అదొక మధురమైన అనుభూతి’ అని రాసుకొచ్చిందీ భామ.
వీరితో పాటు అందాల తారలు... ప్రియాంకా చోప్రా, హీనా ఖాన్, మౌనీ రాయ్, ఈషా రెబ్బా, నోరా ఫతేహి, అదితీరావు హైదరి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...