నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
ఫిట్నెస్ ఫ్రీక్ మల్లికా శెరావత్ తను యోగా చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసి అభిమానులకి ఓ సందేశాన్నిచ్చింది. ‘యోగా అనేది మనకు మనం నిర్వహించుకునే ఒక ముఖ్యమైన సమావేశం. దీనిని ఏ బాసూ క్యాన్సిల్ చేయలేడు’ అంటూ రాసుకొచ్చిందీ సుందరి.
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ శివశంకర్ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి స్నేహా ఉల్లాల్... ‘అయోధ్య - రామ్ మందిర్ 2020’ అంటూ రామ మందిరానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ యూట్యూబ్ ఛానల్ నడుపుతోన్న సంగతి తెలిసిందే.. తాజాగా తన సబ్స్క్రైబర్ల సంఖ్య లక్షకి చేరింది. ఈ సందర్భంగా ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ తన సబ్స్క్రైబర్లకి కృతజ్ఞతలు తెలిపింది.
అందాల నటి రేణూ దేశాయ్ తన కూతురు ఆద్య నవ్వుతున్నట్టుగా ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘కౌంట్ మై టీత్ ఛాలెంజ్ బై ఆద్య’ అనే క్యాప్షన్‌ని జోడించింది భామ.
అందాల తారలు నమ్రతా శిరోద్కర్, కరీనా కపూర్లు బీరుట్ పేలుళ్లపై స్పందించారు. నమ్రత సంఘటనకు సంబంధించిన ఓ ఫొటోని పంచుకుంటూ ‘ఈ పేలుడు, మరణాల్ని చూసి దిగ్ర్భాంతికి గురయ్యా.. బీరుట్ పేలుళ్లలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ స్ర్పెడ్ పీస్, స్ర్పెడ్ లవ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ‘ఈ సంఘటన భయంకరమైనది. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. వైరస్ విజృంభణ, వ్యాపారాలు దెబ్బతినడం, ఇప్పుడు ఈ భారీ పేలుడు... ఓరి దేవుడా.. 2020 మనల్ని భయంకరంగా బాధపెడుతోంది. బాధితుల ఆర్తనాదాలతో నా గుండె బరువెక్కింది’ అంటూ సంఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు అందాల తారలు లావణ్యా త్రిపాఠి, మెహరీన్, అదా శర్మ, చిన్మయి శ్రీపాదలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...