రక్షాబంధన్ సందర్భంగా పలువురు తారలు, తారల పిల్లలు తమ సోదరునికి రాఖీ కట్టి తమ ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇన్స్టాపురమంతా సోదర, సోదరీమణుల ప్రేమాభిమానాలతో నిండిపోయింది. ఆ విశేషాలేంటో చూద్దాం రండి..
సూపర్ స్టార్ మహేష్‌బాబు లవ్లీ డాటర్ సీతా పాప (సితార) తన అన్నయ్య గౌతమ్‌కి రాఖీ కట్టింది. ఈ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ.. ‘రక్షాబంధన్ శుభాకాంక్షలు అన్నయ్యా.. ప్రతిరోజూ నువ్వు నన్ను సంతోషంగా ఉండేలా చేస్తావు.. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. ‘నుకి తాయి’.. నువ్వు దూరంగా ఉండడంతో ఆ రాఖీని కూడా అన్నయ్యకే కట్టాను’ అంటూ సోదర ప్రేమను వ్యక్తం చేసిందీ గ్రేట్ డాటర్.
మెగా డాటర్ నిహారికా కొణిదెల తన అన్నయ్య వరుణ్‌తేజ్‌కి రాఖీ కట్టింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోని పోస్ట్ చేస్తూ... ‘మై భాయి జాన్.. మై గార్డియన్ ఏంజెల్.. ఐ లవ్ యూ సో మచ్ అన్నా’ అంటూ రాసుకొచ్చిందీ గ్రేట్ సిస్టర్.
అందాల తార సమీరా రెడ్డి తన పిల్లలు హన్స్, నైరాలు గడిపిన మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ‘ఎప్పటికీ నీ చేయి పట్టుకొని ఉంటానని, నిన్ను విసిగిస్తానని, ప్రేమిస్తానని, రక్షిస్తానని.. ప్రామిస్ చేస్తున్నాను’ అంటూ పిల్లల భావాలను వ్యక్తపరిచిందీ భామ. అంతేకాదు.. దీనికి రక్షాబంధన్, నాటీ నైరా, హ్యాపీ హన్స్, తోబుట్టువులు, ప్రేమ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించిందీ సుందరి.
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన సోదరులపై ప్రేమాభిమానాల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను పంచుకుంటూ.... ‘నాకు అండగా ఉండి.. నన్ను నేను మలుచుకోవడంలో సహకారం అందిస్తోన్న మీకు ధన్యవాదాలు. మీతో పంచుకున్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు అండగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను’ అంటూ మనోజ్‌కుమార్ మంచు, విష్ణు మంచులను ట్యాగ్ చేసిందీ సిస్టర్.
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి తన పిల్లలు రాఖీ పండగ జరుపుకొన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ‘హ్యాపీ రక్షా బంధన్’ అంటూ అర్హ అయాన్‌కి రాఖీ కట్టిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన సోదరుడు నహుష్ చక్రవర్తితో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘రక్షాబంధన్ శుభాకాంక్షలు పిగ్ఫేస్.. నా ఫీడ్ అంతా నీ ఫొటోలతో నిండిపోయింది’ అంటూ రక్షాబంధన్, సిబ్లింగ్ స్క్వాడ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ భామ.
అందాల భామ మెహరీన్ చిన్నప్పుడు తన సోదరుడి (గురఫతేహ్ సింగ్)కి రాఖీ కట్టిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘నాకు సోదరుడిగా, స్నేహితుడిగా అంతా నువ్వే అయిన నీకు రాఖీ శుభాకాంక్షలు. ఐ లవ్ యూ సో మచ్ మై బ్రదర్, నిన్ను ఎంతో మిస్సవుతున్నాను. తప్పకుండా తొందర్లోనే కలుస్తాను’ అని రాసుకొచ్చిందీ సిస్టర్.
బాలీవుడ్ గాయని నేహా కక్కర్‌కి తన సోదరుడు టోనీ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ సందర్భంగా తనతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులతో పంచుకోగల విలువైన బహుమతి ‘సమయం’. ఈ రక్షాబంధన్‌కి నా సమయమంతా నా అమేజింగ్ బ్రదర్ టోనీతోనే’ అంటూ టిస్సాట్, సీస్టార్ వాచ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ సిస్టర్.
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ తన సోదరులు సిద్ధాంత్ కపూర్, ప్రియాంక్ శర్మల ఫొటోలను పోస్ట్ చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది.
బాలీవుడ్ భామలు సోహా అలీఖాన్, కరీనా కపూర్ల పిల్లలు ఇనాయా, తైమూర్లు రక్షాబంధన్‌ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోని ఇద్దరూ తమ ఖాతాల్లో పోస్ట్ చేశారు.
వీరితో పాటు పలువురు తారలు తమ రాఖీ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...