నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల తార కియారా అడ్వాణీ నేడు తన పుట్టిన రోజు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా వివిధ కేకుల ముందు కూర్చొని ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు... వీడియోలు, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో ప్రేమాభిమానాల వర్షం కురిపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో, మీరు కూడా అంతే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.. ఇదంతా దేవుని ఆశీర్వాదమే’ అంటూ రాసుకొచ్చిందీ సుందరి.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో సితార భిన్నమైన భావాలను వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంది. దానికి తగ్గట్టే ‘మూడ్స్’ అనే క్యాప్షన్ ని జోడించిందీ లవ్లీ డాటర్.
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తీ సునైనా ఓ అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. సాగర తీరంలో దిగిన ఈ ఫొటోకి ‘ప్రతి ఒక్కరికీ ఓ కథ ఉంటుంది.. కానీ వాళ్లు దానిని గట్టిగా చెప్పరు’ అంటూ తన పేరునే హ్యాష్ట్యాగ్గా పోస్ట్ చేసిందీ సుందరి.
టాలీవుడ్ భామ అదా శర్మ కళ్లజోడు పెట్టుకొని ఫొటోలకి పోజిచ్చింది. ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘ఈ రోజు స్పెక్సీ (కళ్లద్దాలు పెట్టుకుని) సెల్ఫీలు దిగాను.. మరి మీరు ఏం చేస్తున్నారు?’ అంటూ రాసుకొచ్చిందీ సుందరి.
బాలీవుడ్ అందాల తార మల్లికా శెరావత్ సోఫాలో కూర్చొని టీ తాగుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇంట్లో ఉన్నప్పుడు.. స్టైలిష్‌గా ఉండలేరని ఎవరన్నారు?’అంటూ క్వారంటైన్ లైఫ్, స్టైల్ ఆన్ మై మైండ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ సుందరి.
‘దేవసేన’ అనుష్క తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లి ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నువ్వు నాకు కేవలం తల్లివి మాత్రమే కాదు.. నాకు తెలిసిన గొప్ప మహిళ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా’ అంటూ అమ్మపై తనకున్న ప్రేమని వ్యక్తం చేసింది.
ప్రముఖ యాంకర్ సుమా కనకాల త్రోబ్యాక్ ఫొటోలంటూ ‘క్యాష్’కి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. అదేవిధంగా - వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గారెలు చేస్తున్న వీడియోని కూడా పంచుకుంది. 'ఈ నెలంతా మీ కుటుంబ సభ్యులకిష్టమైన వంటకాలు చేస్తూ మీరంతా బిజీగా ఉంటారని నాకు తెలుసు' అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది..
మిల్కీ బ్యూటీ తమన్నా ఏదో కలగంటున్నట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో షేర్ చేసుకుంది. ఫొటోకి తగ్గట్టే ‘పగటి కల’ అనే క్యాప్షన్‌ని రాసుకొచ్చిందీ భామ.
బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రగ్యా జైస్వాల్, నమ్రతా శిరోద్కర్లు ‘అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు..’ అంటూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వీరితో పాటు సురభి, భానుశ్రీలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...