నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
తెలుగు నటి, యాంకర్ లాస్యా మంజునాథ్ అమ్మవారి ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి ‘2019లో అమ్మవారిని ఇలా రడీ చేశాను.. వరమహాలక్ష్మీ దేవికి చీరను ఎలా కట్టాలో చూపించాను.. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతున్నాను.. తర్వాతి సంవత్సరం బాగా చేయాలి.. అమ్మవారి అనుగ్రహం ఉండాలి’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన షూటింగ్‌కి సంబంధించిన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మిమ్మల్ని ముందుకు వెళ్లనీయకుండా ఏదైతే ఆపుతుందో అదే భయం.. ఏదైతే మీరు ముందుకు దూసుకుపోవడానికి సహాయపడుతుందో అదే ధైర్యం’ అంటూ భయానికి, ధైర్యానికి మధ్య ఉన్న తేడాని వివరించిందీ స్టార్ యాంకర్.
టాలీవుడ్ భామ అనూ ఇమాన్యుయెల్.. తను టీ తాగుతున్న ఫొటోని షేర్ చేసింది. దీనికి ‘ఉదయం 2 గంటలు.. టీ టైం’ అంటూ #insomniac అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.
సాగర తీరంలో.. సంధ్యా సమయంలో.. బాల్కనీలో డైనింగ్ టేబుల్ వేసి.. ఇద్దరు కూర్చోవడానికి వీలుగా రెండు కుర్చీలు ఉంటే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఫొటోనే అభిమానులతో పంచుకుంది అందాల తార అమీ జాక్సన్. అంతేకాదు.. ‘ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే ఎవరితో కూర్చొంటారు’ అని అభిమానులను అడుగుతోంది. నిజంగా చూడడానికి ఎంత బాగుందో కదా.. ఆ సుందర దృశ్యం. మరి, మీ సమాధానం కామెంట్ బాక్స్‌లో టైప్ చేసి తెలియజేసేయండి...
గాయని మధుప్రియ వేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘నా పరిధి ఆకాశానికి మించినది’ అంటూ ఫర్ యూ, బీ యువర్సెల్ఫ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
తెలుగు తార సురభి తను నటించిన ఓ సినిమాలోని ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ ఫొటో ఏ చిత్రంలోనిదో చెప్పగలరా?’ అంటూ అభిమానులని అడుగుతోందీ భామ. మీకు ఆ ఫొటో ఏ సినిమాలోనిదో తెలిస్తే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేసేయండి మరి.
బాలీవుడ్ అందాల తార కాజోల్ 'దూరం పాటించడం క్షేమం' అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘ఎవరైనా నాకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలా చేస్తా’ అనే క్యాప్షన్‌ని ఫొటోపై రాసుకొచ్చింది.
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తన తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఈ మధ్య నేను దిగిన ఇష్టమైన ఫొటోలలో ఇది కూడా ఒకటి. ఈ ఫొటో తీసింది ఎవరో కాదు.. నా యాపిలే (నిర్వాణ). నేను ఎప్పటికీ నాన్న కుట్టీనే.. ఎప్పటికీ నాన్నే నా సూపర్‌స్టార్, నా సూపర్ హ్యూమన్. ఈ లాక్డౌన్ వల్ల నాన్నని దగ్గర నుంచి చూడడమే కాకుండా.. నాన్నతో నిర్వాణ ఎక్కువ సమయం గడపడం చూశాను. వారిద్దరినీ అలా చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ మై డాడీ మోస్ట్ హ్యాండ్సమ్, కింగ్, ఫేవరెట్ చైల్డ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ భామ.
గత నాలుగు రోజులు నుంచి ‘మహిళలకు మహిళలే అండ’ అనే ఛాలెంజ్ ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు తారలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తాజాగా సన్నీ లియోనీ, కాజల్ అగర్వాల్‌లు తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పోస్ట్ చేసి ఛాలెంజ్‌లో భాగమయ్యారు. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి...