నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
అందాల తార సమంత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా తన 11 సంవత్సరాల సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ‘మంచివాళ్లతో సాగుతోన్న నా ఈ ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేనిది. మంచి, చెడు, ఎత్తుపల్లాలు.. ఇలా అన్నింటిలోనూ నాకు అండగా ఉన్న మీకు నేను కూడా అండగా ఉన్నానని భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ అక్కినేని వారి కోడలు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన అభిమానులకు ఓ ప్రశ్నని సంధించింది. తను నటించిన ఓ చిత్రంలోని ఫొటోని పోస్ట్ చేస్తూ...‘ఈ ఫొటో ఏ చిత్రంలోనిదో చెప్పగలరా?’ అంటూ పోస్ట్ చేసిందీ సుందరి. మరి, మీకు ఆ చిత్రమేంటో తెలుసా? అయితే కామెంట్ బాక్స్‌లో టైప్ చేసేయండి మరి.
‘బిగ్ బాస్’ బ్యూటీ హిమజ తను గుడి దగ్గర ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ... ‘మళ్లీ తిరుపతి ఎప్పుడు వస్తానో వెంకన్నా... ఏంటీ పరిస్థితి! #Tirupathi #Lordvenkateswara.. నా ఈ పోస్ట్ నీకు చేరాలంటే ఈ హ్యాష్‌ట్యాగ్ వాడాలి తండ్రీ..’ అంటూ రాసుకొచ్చింది.
‘అందాల రాక్షసి’ లావణ్యా త్రిపాఠి.. తన పెట్ బ్రూనీతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘చేయని వ్యాయామాలతో బ్రూనీ అలసిపోయింది’ అంటూ లవ్ హర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని తన భర్త, కూతురు ఎక్కడో నడుస్తూ వెడుతున్న ఫొటోని పోస్ట్ చేసి దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ని రాసుకొచ్చింది. ‘తండ్రీ, కూతుళ్లు ముచ్చట పెట్టుకుంటూ వెళ్తున్నారు.. కొద్దిసేపటి తర్వాత నేను లేనన్న విషయాన్ని గమనించారు’ అంటూ దానికి సంబంధించిన ఫొటోలని పోస్ట్ చేసింది.
మరో నటి అదా శర్మ.. నభా నటేష్లాగే తన అభిమానులకు ఓ చిక్కు ప్రశ్నను సంధించింది. ‘నేను మరో తెలుగు చిత్రానికి సంతకం చేశాను. హీరోతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇందులో కొన్ని ఫొటోలు హీరోతో లేవు.. ఎందుకంటే నాకు పచ్చని బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇష్టం. ఇక చివరి చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి.. నా తలపై ఉన్న స్పైడర్ కూడా చిత్రంలో భాగమే! ఇప్పుడు చెప్పండి.. ఈ సినిమా దేనికి సంబంధించిందో?’ అంటూ తన అభిమానులకు ప్రశ్నను సంధించింది. అంతేకాదు ‘ఇందులోని నా లుక్ సినిమాలో భాగం కాదు.. #100yearsofAdahSharma.. #1920to2020.. క్యాప్షన్‌లోనే క్లూ ఉంది, సినిమా టైటిల్ కూడా క్యాప్షన్‌లోనే ఉంది’ వంటి క్లూలు కూడా ఇచ్చింది. మరి ఆ సినిమా దేనికి సంబంధించిందో ఆలోచించండి.. మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి.
తన కన్నుగీటుతో కుర్రకారుని అలరించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ‘స్వర్గం’ అనే మలయాళీ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. దానికి సంబంధించిన ఓ ఫొటోని తన అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది హీరోయిన్ శృతి హాసన్ విభిన్న దుస్తుల్లో దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ రోజు.. ఎన్నో మార్పులు, ఎందుకు కాకూడదు..’ అనే హ్యాష్ట్యాగ్లని జోడించిందీ భామ.
వీరితో పాటు ముద్దుగుమ్మలు.. వరలక్ష్మీ శరత్ కుమార్, దిశా పటానీ, రష్మీ, తేజస్విలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...