నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
మిల్కీ బ్యూటీ తమన్నా యోగా చేస్తోన్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. దీనికి ‘అనంతమైన ప్రేమను పంచుకోవడానికి, స్వీకరించడానికి అనాహత చక్రంతో శ్రీకారం..’ అనే క్యాప్షన్ రాసుకొచ్చిందీ సుందరి.
టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ.. తన దినచర్య ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది..
‘తొందరగా నిద్ర లేవడం.. ధ్యానం.. సానుకూల దృక్పథం.. యాపిల్ సిడార్ వెనిగర్.. శరీరాన్ని, మనసుని శుభ్రపరుచుకోవడం.. చర్మ సంరక్షణ.. వ్యాయామం.. తగినంత నీళ్లు తాగడం.. మరిన్ని పాజిటివ్ ఆలోచనలు..’ అంటూ తన అందం, ఆరోగ్య రహస్యాన్ని తెలిపిందీ భామ.
యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ షూటింగ్ కోసం ధరించిన అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతోంది. ఆ అవుట్‌ఫిట్ ఫొటోని పోస్ట్ చేస్తూ... 'ఒక్కోసారి పరీక్షలు ఎదురవుతుంటాయి... మన బలహీనతలు చూపించడానికి కాదు... మన బలాలను కనుక్కోవడానికి...' అంటూ ‘స్టే స్ట్రాంగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసింది.
అందాల తార మంచు లక్ష్మి.. తన సహచరులు ప్రకాశ్ కోవెలముడి, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్‌లతో కలిసి దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. 'నాకు ఇష్టమైన వ్యక్తులతో ఎప్పుడు కలిసున్నా చెప్పలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది..మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని రాసుకొచ్చిందీ సుందరి.
యాంకర్ శ్యామల ఇంట్లోనే వ్యాయామం చేస్తోంది. తను వ్యాయామం చేసిన తర్వాత దిగిన ఫొటోని ఎలాంటి ఫిల్టర్లు వాడకుండా అభిమానులతో పంచుకుంది. దీనికి ‘హ్యావ్ ఎ గ్రేట్ డే’ అనే క్యాప్షన్‌ని జోడించిందీ సుందరి.
అందాల నటి, మోడ్రన్ సావిత్రి... కీర్తి సురేష్ ఉత్సాహంగా ఎవరికో హాయ్ చెప్తున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. దానికి ‘స్వప్నా.. నేను నిన్ను చూసినప్పుడల్లా నాలో ఈ ఉత్సాహం కనిపించేది. బహుశా.. నా చివరి రెమ్యునరేషన్ నువ్వు ఇచ్చినందుకు కావచ్చు.. మిస్ యూ..’ అంటూ ఫన్నీ, లవ్ ఎమోజీలను జత చేసిందీ భామ.
అందాల తార సమీరా రెడ్డి తన పాప నిలబడడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియోని పోస్ట్ చేసింది. దానికి ‘నువ్వు సాధించావ్ నైరా.. తను ఎలా సొంతంగా నిలబడిందో నైరా చూపిస్తోంది. దాదాపు నడిచేస్తోంది...’ అంటూ మైల్స్టోన్, బేబీ, పాజిటివ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ వంటి హ్యాష్‌ట్యాగులను జత చేసిందీ భామ.
వీరితో పాటు.. అందాల భామలు భానుశ్రీ, దిశా పటానీ, వితిక, నిహారిక, రష్మి, హీనా ఖాన్లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి..