నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
అందాల భామ రేణూ దేశాయ్ తన కూతురు ఆద్యతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఇది ఆద్య ఫిల్టర్ చేసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్‌ని జోడించిందీ ఈ భామ.
బాలీవుడ్ తార కరీనా కపూర్ సోఫాలో కూర్చుని దేని కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోకి ‘2021 కోసం ఎదురు చూస్తున్నాను’ అనే క్యాప్షన్‌ని రాసుకొచ్చిందీ తార.
ఎనర్జిటిక్ యాంకర్ సుమ కనకాల తన పెట్ డాగ్ జొర్రో పుట్టిన రోజును సెలబ్రేట్
చేసింది. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘ప్రియమైన నా జొర్రో పుట్టినరోజు.. ప్రేరణ (సుమ మేనకోడలు) ఎంతో ఆతృతగా ఉంది’ అంటూ రాసుకొచ్చింది ఈ యాంకర్.
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో దిగిన ఓ స్వీయ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దానికి ‘ఈ వాతావరణం మమ్మల్ని టెర్రస్‌పై ఫ్యామిలీతో కలిసి టీ పార్టీ చేసుకునేలా చేసింది’ అనే క్యాప్షన్‌ని జోడించిందీ సుందరి.
మహేష్ స్వీట్ హార్ట్ నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితార టీవీ చూస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దానికి ‘నా చిట్టితల్లి మరో పది రోజుల్లో 8వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతోంది. కాలం గిర్రున తిరుగుతోంది..’ అంటూ టీవీ టైమ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ సూపర్ స్టార్ వైఫ్.
సింగర్ మధుప్రియ తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. 'నా ప్రపంచం.. నా ప్రేమ.. మీ కోసం..' అనే హ్యాష్ ట్యాగ్స్ ఈ ఫొటోకి జత చేసింది.
బాలీవుడ్ గాయని నేహా కక్కర్ తను స్టేజ్‌పై పాటలు పాడుతున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ సంగీత కచేరీలను మిస్ అవుతున్నాన్న హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ ఈ భామ.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ దర్శకుడు బాలాతో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేస్తూ.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
వీరితో పాటు అందాల భామలు కాజోల్, ప్రగ్యా జైస్వాల్, రష్మీ గౌతమ్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...