నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
ఈ రోజు కరిష్మా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా తన సోదరి కరీనా కపూర్, మరో నటి సోనమ్ కపూర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. కరిష్మా తమకు ఎన్నో రకాలుగా స్ఫూర్తిదాయకురాలని కొనియాడారు.
అందాల భామలు.. దీప్తి సునైనా, శ్యామలలు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ... ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకటే క్యాప్షన్‌ని పోస్ట్ చేశారు. ‘మీరు ఎదగాలంటే.. మిమ్మల్ని నిరుత్సాహపరిచే విషయాలకు దూరంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా తన పెంపుడు పిల్లిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఈ పిల్లికి కెమెరా అంటే బిడియం..’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ని రాసుకొచ్చిందీ సుందరి.
బుల్లితెర స్టార్ హీనా ఖాన్ – ‘డియర్ స్ట్రెస్..గుడ్ బై.. కొద్దిగా టెన్షన్ ని వదిలించుకొన్నాను.. దయచేసి నన్ను చంపకండి..' అంటూ తన కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలతో అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ‘మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా చైతన్యం కల్పిస్తోంది. ‘కరోనాను ఓడించడానికి మీ వంతుగా ఈ చిన్న పనిని చేయండం’టూ తను మాస్క్ ధరించిన ఫొటోను పోస్ట్ చేసింది.
నటి శృతి హాసన్ ఓ యాప్ ద్వారా తన ముఖాన్ని అబ్బాయి, బామ్మ రూపాల్లో మార్చి అభిమానులతో షేర్ చేశారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


వీరితో పాటు.. వరలక్ష్మీ శరత్‌కుమార్, అనసూయ, కాజోల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...