టాలీవుడ్ భామ నమ్రతా శిరోద్కర్ తన స్నేహితురాలికి బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా నమ్రత.. సితారతోపాటు మరో నలుగురు స్నేహితులతో కలిసున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు తన భర్తతో కలిసున్న ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. ‘ఈ వీడియో ఈ ఏడాది జనవరిలో నా పుట్టినరోజు సందర్భంగా మాల్దీవుల్లో తీసింది. ఇప్పుడు లాక్డౌన్ ఉన్నా కూడా అంతే ఆనందంగా ఇంట్లోనే గడుపుతున్నాం.. జీవితంలో ప్రతి క్షణాన్ని అస్వాదిస్తున్నాం’ అంటూ అందరినీ ప్రేమించండి అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందీ ఫిట్నెస్ ఫ్రీక్.
బాలీవుడ్ భామ రవీనా టాండన్ కొన్ని ఫన్నీ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో తను కూర్చున్న ఛైర్ మీద ఉన్న పిల్లి తననే చూస్తోంది.. రవీనా కూడా ఆ పిల్లిని తదేకంగా చూస్తున్నట్టుంది. దీనికి ‘కొన్ని సంఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయి’ అనే క్యాప్షన్ జోడించిందీ భామ.
‘బై.. బై.. సమ్మర్’ అంటూ సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి తన తాజా చిత్రాలను పోస్ట్ చేసింది.
గోవా బ్యూటీ ఇలియానా కొంతమంది పిల్లలతో ఉన్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.. దీనికి ‘లవ్’ అనే క్యాప్షన్‌ని జోడించిందీ సుందరి.
మరో నటి ప్రణీత.. తన సహ నటి కాజల్ అగర్వాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు.. తనతో దిగిన ఓ ఫొటోని కూడా షేర్ చేసింది.
ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణె తన ఫోన్లో ముంబయి అందాలను బంధించింది. ఆ ఫొటోని తన అభిమానులతో పంచుకుంటూ.. ‘ఈ ఫొటోలో ఎలాంటి ఫిల్టర్లు ఉపయోగించలేదు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
వీరితో పాటు అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్, కరీనా కపూర్, హీనా ఖాన్లు కూడా తమ తాజా చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. మరి నేటి ‘ఇన్‌స్టాపురం’ విశేషాలపైన మీరూ లుక్కేయండి...