ఈ రోజు ఇన్‌స్టాపురములో బాలీవుడ్ భామలు అనుష్కా శర్మ, కరీనా కపూర్ గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ‘ఒక జవాను వీర మరణం పొందితే దాన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో, ఆ బాధ ఎలా ఉంటుందో.. ఒక సైనికుడి కూతురిగా నాకు తెలుసు.. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబానికి దూరంగా ఉండి చేసే ఈ త్యాగం అసమానమైనది. ఈ సమయంలో శాంతి నెలకొనాలని, వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.. జై జవాన్’ అంటూ తన గుండెల్లోని దేశభక్తిని చాటింది అనుష్క.
ఇక కరీనా స్పందిస్తూ.. ‘వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. మీ త్యాగాలను మేమెప్పటికీ మరువలేం’ అంటూ పోస్ట్ చేసింది.
బాలీవుడ్ గాయని నేహా కక్కర్.. సుశాంత్ సింగ్ స్వర్గంలో ఉన్నట్టుగా రూపొందించిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దానికి ‘నువ్వు మళ్లీ పుడతావు.. ఆ జన్మలో పోరాడి విజయం సాధిస్తావు.. నిన్ను మర్చిపోలేకపోతున్నాం సుశాంత్..’ అంటూ క్యాప్షన్ జోడించిందీ భామ.
మన స్టార్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షూటింగ్ తిరిగి మొదలైన సందర్భంగా తన ఆనందాన్ని జిఫ్ ఫొటోగా మలచి అభిమానులతో పంచుకుంది..
టాలీవుడ్ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తాను చేనేత దుస్తులు ధరించిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది..
మరో టాలీవుడ్ భామ మెహరీన్ తన తల్లి ఫొటోను పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అందాల తార రాధికా ఆప్టే తను నటించిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో దిగిన ఓ ఫన్నీ ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ సన్నీ లియోని మూడు నెలల తర్వాత జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.