జీవితం అంటే అదే..!
రష్మీ గౌతమ్ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించినా ‘జబర్దస్త్’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్ యాంకర్.
108 సూర్య నమస్కారాలు చేస్తున్నా..!
టాలీవుడ్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే తారల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది స్మైలింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. లాక్డౌన్ కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వర్కవుట్లు చేయడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి కేటాయిస్తోంది. ఈ క్రమంలో తను సూర్యనమస్కారాలు చేస్తోన్న వీడియోను ఇన్‌స్టా వేదిక ద్వారా తాజాగా తన అభిమానులతో పంచుకుంది.
రకుల్ వీడియోను షేర్ చేస్తూ ‘ఈ లాక్డౌన్లో నేను వారానికి రెండు నుంచి మూడు సార్లు 108 సూర్య నమస్కారాలు చేస్తున్నాను. వ్యాయామం తర్వాత కలిగే అనుభూతి వర్ణనాతీతం. సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఇటు శారీరకంగానే కాకుండా అటు మానసికంగా కూడా దృఢమవుతారు. సంయమనం సొంతమవుతుంది. అంతేకాదు.. శరీరంలోని విషతుల్యాలన్నీ బయటకు వెళ్లిపోతాయి’ అంటూ రాసుకొచ్చిందీ ఈ ఫిట్నెస్ ఫ్రీక్.
మూడు నెలల ముందు అక్కడే ఉన్నాం..!
పెద్ద కళ్లు, ఆకట్టుకునే నటన, అందమైన రూపం.. నటి ప్రణీతకు మాత్రమే సొంతం. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంతకు అక్కగా నటించి అందరి మన్ననలను పొందింది ఈ భామ. ప్రణీత హిందీలోనూ నటిస్తోంది. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘హంగామా 2’ వంటి చిత్రాల్లోనూ ఆడిపాడనుంది ఈ బాపుగారి బొమ్మ.
సినిమాల విషయం అటుంచితే.. ఈ భామ సామాజిక సేవలోనూ ముందుంటుంది. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తనవంతు సహాయం అందించింది. తనే సొంతంగా భోజనం తయారు చేయించి.. ఆ ఆహార పొట్లాలను పేదలకు అందించింది. అటు సామాజిక సేవ చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో కూడా తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుందీ ఈ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ‘కరోనా మహమ్మారి విజృంభించక ముందే కొద్ది నెలల క్రితం మేము చైనాలో(మకావు) ఉన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..!
తన అందచందాలు, అభినయంతోనే కాదు.. తనదైన ఫిట్టెస్ట్ బాడీతో ఎంతోమంది అభిమానుల మనసు చూరగొంది బాలీవుడ్ భామ బిపాసా బసు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో దిగిన ఫొటోలను, వివిధ వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా తన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసిందీ సుందరి.
‘కొన్నిసార్లు మనం చేసే మంచి పని ఏంటంటే.. ఏమీ ఆలోచించకపోవడం, ఆశ్చర్యపడకపోవడం, ఊహించకపోవడం, మధనపడకపోవడం. ఒక్కసారి శ్వాస తీసుకుని అంతా మంచే జరుగుతుందనే నమ్మకాన్ని కలిగి ఉండండి..’ అటూ చెప్పుకొచ్చిందీ సుందరి. దీనికి ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించింది.