హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్!
తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్!!!! ఐ లవ్ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.
ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో !
సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండడం మహేష్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్‌కు అలవాటనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, పిల్లల ఫోటోలు, తన భర్త సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవడం నమ్రతకు అలవాటే. తాజాగా తన గారాల పట్టి సితార.. మట్టి కుండను తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ‘నా గారాల పట్టి మొదటిసారి మట్టి కుండను తయారు చేస్తోంది.. మేమంతా తన చిట్టి చేతులతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అంటూ #SafeHandsFirst అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ సూపర్ మామ్.
మా ఇంట్లోకి డైనోసార్ వచ్చింది..!
కరోనా కారణంగా దేశమంతా లాక్డౌన్లో ఉంది. ప్రస్తుతం కొన్ని రంగాల వారికి కొన్ని సడలింపులిచ్చినా సినిమా, క్రీడా రంగాల వారు ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. దీంతో ఈ రంగాలకు చెందిన వారందరూ ఇంకా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిత్యం బిజీగా ఉండే వీరు లాక్డౌన్ కారణంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట ముందు వరుసలో ఉంటుంది. వీరిద్దరూ చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.
ఈ క్రమంలోనే అనుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా చిన్న పిల్లలు తలపై వేళ్లను పెట్టి.. పిల్లిలాగా అరుస్తూ పెద్దలను ఆట పట్టిస్తుంటారు. అలాగే విరాట్ కోహ్లీ డైనోసార్‌లాగా నటిస్తూ ఇంట్లోకి వస్తున్న వీడియోని తీసి పోస్ట్ చేసింది. దీనికి ‘బందిఖానాలోంచి తప్పించుకున్న డైనోసార్ మా ఇంటికొచ్చింది’ అనే క్యాప్షన్‌ని జోడించింది భామ.
RRR కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా..!
‘సూపర్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనుష్క.. ‘అరుంధతి’తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ దేవసేన సినిమాల్లో తప్ప బయట ఎక్కువగా కనిపించదు. సోషల్ మీడియాలోనూ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ సోషల్ మీడియాలో కనిపించిందీ జేజమ్మ. ఈ క్రమంలో తారక్ ఫొటోను షేర్ చేస్తూ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. RRR సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మీ టీం అందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ ఎన్టీఆర్‌కి బర్త్‌డే విషెస్ చెప్పింది.