scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేనందుకున్న గొప్ప బహుమతి నువ్వే డియర్‌..!

latest posts of celebrities in social media

మీరేం మిస్సవుతున్నారు?

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on


లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా? ఎప్పుడెప్పుడు స్వేచ్ఛగా విహరిద్దామా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారంతా. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ఏం చేయాలో ఓ జాబితాను కూడా రూపొందించుకుంటున్నారు కొందరు. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతులేం కాదు.

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on


నటి కృతీ కర్బందా లాక్‌డౌన్‌ తర్వాత తానేం చేయాలనుకుంటోందో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. గతంలో ‘పోల్‌ వర్కవుట్‌’ చేస్తోన్న సమయంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘నాకెంతో ఇష్టమైన వర్కవుట్‌. అయితే ఇందుకోసం ఇంట్లో పోల్‌ ఏర్పాటు చేసుకోలేనందుకు నిజంగా చింతిస్తున్నాను. లాక్‌డౌన్‌ తర్వాత నేను చేయబోయే మొదటి పని ఇదే. మీ జాబితాలో ఉన్నవేంటి..? మీరేం మిస్‌ అవుతున్నారు?’ అంటూ అభిమానులను ప్రశ్నిస్తోందీ బ్యూటీ.
నేనందుకున్న గొప్ప బహుమతి నువ్వే డియర్‌..!

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


బాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌లో సోనమ్‌ కపూర్, ఆనంద్‌ అహుజా జంట ఒకటి. నాలుగేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమకు నిలువెత్తు రూపంలా కనిపిస్తారు. ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ దంపతులకు ప్రేమ పాఠాలు నేర్పుతుంటారు. ఈ క్రమంలోనే నేడు (మే 8) రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారీ బ్యూటిఫుల్‌ కపుల్‌. ఈ సందర్భంగా సొగసుల సోనమ్‌ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


భర్త ఆనంద్‌తో కలిసి తొలిసారి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ తన ప్రేమ కథను గుర్తుచేసుకుంది. ‘మనిద్దరం (భర్తను ఉద్దేశిస్తూ) కలిసి దిగిన తొలి ఫొటో ఇది.. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నేను ఒక వీగన్‌ని కలుసుకున్నాను. తను క్లిష్టమైన యోగాసనాలను ఎంత సులభంగా వేయగలడో.. వ్యాపారం గురించి కూడా అంతే చాకచక్యంగా మాట్లాడే నేర్పు అతని సొంతం. అతని ప్రవర్తన, నడవడిక నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అతను ఇప్పటికీ నా గుండె చప్పుడును పరుగులు పెట్టించగలడు.. అదే సమయంలో తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలడు. అంత ఎమోషనల్‌గా నాకు కనెక్ట్‌ అయ్యాడతను.

నీకు సాటెవరూ లేరు ఆనంద్‌.. నీలోని దయాగుణం, ఔదార్యం, నిబద్ధత, స్మార్ట్‌నెస్‌ నన్ను కట్టిపడేశాయి. వీటితో పాటు మూడీగా ఉండడం, చిరాకు తెప్పించే పనులు చేయడంలో కూడా ఎవరూ నీ అంత పర్‌ఫెక్ట్‌ కాదు. నా భాగస్వామివై, నాలుగేళ్లుగా నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నాలుగేళ్లలో నీ సహచర్యంలో ఎన్నో మధురానుభూతులను చవిచూశా. హ్యాపీ యానివర్సరీ మై డియర్‌ హబ్బీ. ఇకపై కూడా జీవితాంతం నీతో కలిసి నడుస్తానన్న ఆలోచనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఇదంతా నా అదృష్టం. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నా.. అంతకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నా జీవితంలో నేను అందుకున్న గొప్ప బహుమతివి నువ్వే డార్లింగ్‌..’ అంటూ తన భర్తపై తనకున్న ప్రేమనంతా రంగరించి సుదీర్ఘమైన క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ వైఫ్‌. సుమారు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ప్రేమపక్షులు 2018, మే 8న పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే.కశ్మీరీ పులావ్‌లో కశ్మీర్‌ ఉంటుందా?

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


ట్యాలెంట్‌, అందం, ఫిట్‌నెస్‌ వీటన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌ బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి. అటు పిల్లలు, ఇటు వర్కవుట్లతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


ఇటీవలే తన భర్త రాజ్‌ కుంద్రాతో కలిసి శిల్ప చేసిన ఓ ఫన్నీ వీడియో నవ్వులు పూయిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న ఫన్నీ సంభాషణకు చక్కటి హావభావాలు పలికిస్తూ తన భర్తతో కలిసి రూపొందించిన ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది శిల్ప.
శిల్ప: గరమ్‌ గరమ్‌ ఆలూ పరాఠా..
రాజ్‌: ఈ పరాఠాలో ఆలూ ఎక్కడ కనిపిస్తోంది..?
శిల్ప: ఆలూ ఎక్కడ కనిపిస్తోందా..! కశ్మీరీ పులావ్‌లో.. ‘కశ్మీర్‌’ కనిపిస్తుందా.?, బెనారస్‌ శారీలో ‘బెనారస్‌’ కనిపిస్తుందా.? పెద్ద.. మాట్లాడుతున్నావు..’ అంటూ ఈ జంట మధ్య సాగిన సంభాషణ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.నా ఫ్రిజ్‌లోకి ఇలాగే చూస్తా..!

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


తన అందమైన చూపులు, క్యూట్‌ నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది నటి అనుపమా పరమేశ్వరన్‌. కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆచితూచి పాత్రలను ఎంచుకుంటోందీ బ్యూటీ. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. కొంటెగా నవ్వుతూ చూస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నేను నా ఫ్రిజ్‌లోకి ఇలాగే చూస్తాను’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఇక ‘లాక్‌డౌన్‌లో నేను చేసే పని.. తినడం.. తినడం.. తినడం..’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం జోడించిందీ బ్యూటీ.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram