scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

మళ్ళీ పెళ్లి చేసుకుంటా.. కానీ నీ కన్నా అదంటేనే ఇష్టం!

latest posts of celebrities in social media

నా కిరీటం మీకు నచ్చిందా..?

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


తనదైన సహజ నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణుల్లో అనుపమా పరమేశ్వరన్‌ ఒకరు. ఆచితూచి సినిమాలను ఎంచుకునే ఈ కేరళ బ్యూటీ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించి మెప్పించింది. ఇక అనుపమ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటుందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అనుపమ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కర్లీ హెయిర్‌ను బ్యాండ్‌తో బంధించి కిరీటంలా వెనక్కి పెట్టుకొని కొంటెగా కన్నుకొడుతూ నవ్వుతోన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘అందరూ ఏం చేస్తున్నారు..? మీకు నా కిరీటం నచ్చిందా.?’ అనే క్యాప్షన్‌ను జోడించింది.
హరితేజ ‘కోతి చేష్టలు’ చూశారా.?

View this post on Instagram

A post shared by hariteja (@actress_hariteja) on


టీవీ సీరియళ్ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన నటి హరితేజ.. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక 2017లో ప్రసారమైన ‘బిగ్‌బాస్’ తొలి సీజన్‌తో మరింత ఎక్కువ మందికి పరిచయమైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో ఒక్కసారిగా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల వచ్చిన ‘హిట్‌’ సినిమాలో విలక్షణమైన నటనతో తనలోని మరో కోణాన్ని బయపెట్టిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by hariteja (@actress_hariteja) on


ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన హరితేజ తన వ్యక్తిగత విషయాలు, ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే మామిడి చెట్టు ఎక్కుతోన్న సమయంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘కోతి చేష్టలు’ అనే ఫన్నీ క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.నాకు నీ కంటే ఫుడ్‌ అంటేనే ఇష్టం..!

View this post on Instagram

A post shared by Anita H Reddy (@anitahassanandani) on


‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార అనిత. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రోహిత్‌ రెడ్డితో వివాహానంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ‘నాగిని’ సీరియల్‌ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటోంది.

View this post on Instagram

A post shared by Anita H Reddy (@anitahassanandani) on


భర్త రోహిత్‌తో కలిసి దిగిన రొమాంటిక్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకునే ఈ చిన్నది తాజాగా ఓ ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసింది. డోనట్‌ని అనిత వేలికి రింగ్‌ మాదిరిగా తొడుగుతూ.. ‘విల్‌ యూ మ్యారీ మీ’ (నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా) అని రోహిత్‌ ప్రశ్నించగా.. దానికి అనిత యస్‌..యస్‌ అంటూ నవ్వుతోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ‘నిన్ను (భర్త రోహిత్‌ను ఉద్దేశిస్తూ) మళ్లీ పెళ్లిచేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే ఒకటే సమస్య.. నాకు నీ కంటే ఫుడ్‌ అంటేనే ఎక్కువ ఇష్టం..’ అని అనిత ఈ వీడియోకు జోడించిన క్యాప్షన్‌ నవ్వులు పూయిస్తోంది.మిమ్మల్ని మీరు అభినందించుకోండి..!

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on


సినీ వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న వారిలో లక్ష్మి మంచు ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా, అమ్మగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. కూతురితో కలిసి యూట్యూబ్‌ ఛానల్‌ని కూడా నిర్వహిస్తోంది లక్ష్మి. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపే ఈ మంచు వారమ్మాయి.. లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా సద్వినియోగపరచుకుంటోంది.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on


ఉదయాన్నే ఇంట్లో వర్కవుట్లు చేస్తోన్న సమయంలో చిత్రీకరించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ సూపర్‌ మామ్‌.. ‘ప్రతిరోజూ ఉదయం మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడానికి చేస్తోన్న ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని మీరే అభినందించుకోండి..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.
స్మృతీ ఇరానీ కొత్త ఛాలెంజ్‌ చూశారా..?

View this post on Instagram

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on


సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఒకరు. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుందీ లేడీ లీడర్.

ఈ క్రమంలోనే స్మృతి తాజాగా ఓ ఫన్నీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Guess the gibberish’ పేరుతో ఓ ఛాలెంజ్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఉండే ఈ ఫిల్టర్‌ ఓపెన్‌ చేస్తే.. కెమెరా ముందున్న వ్యక్తి తలపై బాక్సులో గజిబిజిగా ఉండే ఒక వాక్యం/పదం చూపిస్తుంది. అయితే సరైన అర్థం వచ్చే వాక్యం/పదం ఏమిటో చెప్పడమే ఈ ఛాలెంజ్‌ ముఖ్య ఉద్దేశం. అయితే అది కూడా నిర్ణీత సమయంలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన స్మృతీ ఇరానీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

4520socialglamourgh650-1.jpgవారికి రుణపడి ఉంటాం..

బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో రిషీ కపూర్‌ మరణంతో యావత్‌ బాలీవుడ్‌ సినీ పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఎందరో తారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఆయన భార్య నీతూ కపూర్‌ రిషీకి వైద్య సేవలందించిన డాక్టర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


‘రిషీ మరణం.. మా కుటుంబానికి తీరని లోటు. కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలను తలచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తోంది.. అంతేకాదు.. రిషీకి చికిత్స అందించిన ‘HN రిలయన్స్‌ హాస్పిటల్‌’ డాక్టర్స్‌కు మేం రుణపడి ఉంటాం. ‘Dr. Tarang Giachandani’ నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు నా భర్తను సొంత వ్యక్తిలా భావించి చికిత్సనందించారు. అంతేకాదు.. మమ్మల్ని కూడా తమ సొంత వారిగా భావిస్తూ మాలో ధైర్యాన్ని నింపారు. మా పట్ల ఇంత శ్రద్ధ వహించిన ఆ వైద్య సిబ్బందికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు నీతా.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సిస్టర్స్.. మీరే లేకుంటే ఈ మహమ్మారితో యుద్ధం చేయలేం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీనివల్ల ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అదే సమయంలో చాలామంది ఆసుపత్రుల్లో బెడ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ‘ఐఐఎంయుఎన్‌’ అనే విద్యార్థుల బృందం ‘ఫైండ్‌ ఏ బెడ్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థను యువతే ముందుండి నడిపిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ‘యువత ద్వారా.. దేశం కోసం’ (By the Youth, For the Country) అనే ట్యాగ్‌లైన్‌ని జోడించారు. 160 పట్టణాల్లో ఉన్న దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా www.Findabed.in అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్పిటల్‌ నంబర్లు, బెడ్ల వివరాలు, క్వారంటైన్‌ సెంటర్ల వివరాలు ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

పూలకుండీలతో పొట్ట చుట్టూ కొవ్వును ఇలా కరిగించండి..!

నటి సాక్షి అగర్వాల్‌ పూల కుండీలతో వ్యాయామం చేస్తోన్న తన వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నాలుగు పూల కుండీలను ఉపయోగించి ఈ అద్భుతమైన వ్యాయామాలను చేయండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉండేలా చూసుకోండి. అయితే నా దగ్గర ఇంత బరువున్న పూల కుండీలు లేవు. కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి..’ అని రాసుకొచ్చింది. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉంటుంది. మా ఇంట్లో ఈ వెయిట్స్ లేవు.. అందుకే కుండీలతో కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి..’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram