జీవితం మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉంటుంది..!
జీవితంలో తొలి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. తొలిసారి సినిమాకు వెళ్లడం, తొలిసారి రైలెక్కడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధుర జ్ఞాపకాలు మన గుండెలోతుల్లో దాక్కొని ఉంటాయి. వాటిని తట్టి లేపితే మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది.
తాజాగా ఇలాంటి ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది అందాల తార యామీ గౌతమ్. తొలిసారి స్కూల్‌కు వెళుతోన్న సమయంలో తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ చిన్నది.. ‘స్కూల్లో నా తొలిరోజు. అసలు ఎక్కడికి వెళుతున్నానో ఆ సమయంలో నాకు కచ్చితంగా తెలియదు. కానీ నాకు యూనిఫాం వేయించి, అమ్మానాన్న ఎక్కడికో తీసుకెళుతున్నారని మాత్రం చాలా ఉత్సాహంతో ఉన్నాను. తర్వాత కూడా జీవితంలో ఎప్పుడూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాను. నేను చాలాసార్లు చెప్పినట్లు.. జీవితం ఎక్కడికి తీసుకెళ్లినా సరే.. ప్రతి క్షణం మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉంటుంది. కేవలం మనల్ని మనం నమ్ముకుంటూ.. జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లడమే మన పని’ అని తన మనసులో దాగున్న అందమైన భావాలను అక్షరీకరించిందీ చిన్నది.
మహేష్‌కు మసాజ్ వలంటీర్ దొరికింది..!
లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే వారు కూడా ఇప్పుడు గడప దాటి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. దీంతో ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా ఎంచక్కా కుటుంబసభ్యులతో కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్వారంటైన్ సమయంలో మహేష్ ఎంచక్కా ఇంట్లోనే భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు.
తాజాగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మహేష్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. మహేష్ సోఫాలో కూర్చోగా వెనకాల కూతురు సితార తండ్రికి హెడ్ మసాజ్ చేస్తోన్న ఫొటోను పోస్ట్ చేసిన నమ్రత.. ‘గౌతమ్ ఆడుతున్న గేమ్‌ని చూస్తూ.. రెండు నిమిషాల్లో హెడ్ మసాజ్ పూర్తి చేయమని మహేష్ తన వలంటీర్ (సితార)కి చెప్పాడు. మొత్తానికి మసాజ్ బావుంది అని ఫీడ్‌బ్యాక్ వచ్చింది..’ అంటూ ఫన్నీగా క్యాప్షన్ రాసుకొచ్చింది నమ్రత.
నేనిలా ఉండడానికి కారణం అమ్మే..!
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అదా శర్మ. ఈ సినిమాలో తనదైన నటన, అందంతో కుర్రకారును పరేషాన్ చేసిందీ బ్యూటీ. ఇక అనంతరం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మహా చురుగ్గా ఉండే ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను, వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
ఎప్పుడూ తన వ్యక్తిగత ఫొటోలనే షేర్ చేసే అదా.. తాజాగా తన తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘నేను మానసికంగా ఇంత దృఢంగా ఉండడానికి కారణం, నా అల్లరితనం వెనకున్న ప్రోత్సాహం.. రెండూ అమ్మే’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ. ఇక ఈ ఫొటోలో తల్లీకూతుళ్లిద్దరూ ఒకే రకమైన వైట్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు.
డూ యూ లవ్ మీ?
‘లోఫర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల నటి దిశా పటానీ. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన అందచందాలతో అభిమాలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే’ చిత్రంలో నటిస్తోంది.
దిశ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘బాఘీ-3’ సినిమాలో తాను ఆడిపాడిన ‘డూ యూ లవ్ మీ’ అనే పాట మేకింగ్ వీడియోను పోస్ట్ చేసిన ఈ చిన్నది.. ‘డూ యూ లవ్ మీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.