scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ఈ ‘బర్రె పిల్ల’ నన్ను వదలట్లేదు..!

latest posts of celebrities on social media

చాలాసేపు నిద్ర పోయాక...

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఓవైపు సినిమాలతో మాయ చేస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో అక్కినేని వారి కోడలు సమంత కూడా ఒకరు. వివాహం తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న ఈ బ్యూటీ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక సమంతకు తన పెంపుడు శునకం అంటే చాలా ఇష్టం. దాంతో దిగిన ఫొటోలను నెట్టింట్లో అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సామ్‌.. తాజాగా తన పెంపుడు కుక్కతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పెట్‌ డాగ్‌ను హగ్‌ చేసుకొని పడుకున్న సమయంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. 'చాలాసేపు నిద్ర పోయాక...' అనే క్యాప్షన్‌ను జోడించింది.



ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిద్దాం!

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే జరుపుకుంటాం. మరి ఈ సమస్త జీవరాశికి ఆవాసం కల్పిస్తోన్న భూమాతకు ఓ ప్రత్యేక రోజు ఉండాల్సిందే అంటూ మనమంతా ఏటా ఏప్రిల్‌ 22న ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. నేడు ఈ రోజును పురస్కరించుకొని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్‌ మీడియా వేదికగా భూమాతకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

ఈ క్రమంలోనే బాలీవుడ్‌ అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. ప్రకృతి రమణీయత నడుమ సైకిల్‌పై సవారీ చేస్తోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ప్రకృతి తనను తాను పునర్నిర్మించుకోవడానికి కాస్త సమయం సరిపోతుందని ఈ లాక్‌డౌన్‌ మరోసారి నిరూపించింది. ‘ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా ప్రకృతి పరిరక్షణలో భాగంగా మనవంతుగా కృషి చేద్దాం.. ఈ క్రమంలో ఇక నుంచి విద్యుత్‌ ఉపకరణాలను అవసరం లేనప్పుడు వాడమని, వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటుతామని, నీటిని-ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరూ గర్వించేలా.. అందరం కలిసి ఓ ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిద్దాం..’ అని రాసుకొచ్చిందీ స్టార్‌ హీరోయిన్‌.



బీచ్‌లో బెల్లీ బ్యూటీ..!

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

‘దేవదాసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఇలియానా. తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుందీ బెల్లీ బ్యూటీ. పలువురు స్టార్‌ హీరోల సరసన నటించిన ఈ చిన్నది.. తెలుగులో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

ప్రస్తుతం సినిమాల్లో కాస్త వేగం తగ్గించినా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లోనే ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్‌ చేస్తూనే ఉంటుంది. గతంలో బీచ్‌లో సేదదీరుతూ దిగిన ఫొటోను తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేస్తూ.. ‘ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ గోవా బ్యూటీ.



ఈ ‘బర్రె పిల్ల’ నన్ను వదలట్లేదు..!

‘ఇనవే బర్రె పిల్లా.. నువ్వు విన్నావా బర్రె పిల్లా. ఇన్నావా బర్రె పిల్లా.. నేనే నా ఎర్రి గొల్లా’.. ప్రస్తుతం ఈ పాట టిక్‌టాక్‌లో సెన్సేషన్‌గా మారింది. గతకొన్ని రోజులుగా నెటిజన్లు ఈ పాటకు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫన్నీ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరిచూపు ఈ పాటపై పడింది.

ఇక తాజాగా మంచు లక్ష్మి ఈ పాటను ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో అది మరింత వైరల్‌గా మారింది. పాటకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ పాట నా బుర్రలోంచి వెళ్లట్లేదు.. వినవే బర్రె పిల్లా’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించిందీ సూపర్‌ మామ్‌.

ఇంతకీ ఈ పాట ఎక్కడిది..?

ప్రస్తుతం టిక్‌టాక్‌లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ పాట 1957లో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘వీర కంకణం’ అనే సినిమాలోనిది. కేవలం ‘బర్రె పిల్లా’ అనే లిరిక్స్‌ వింటే నవ్వొస్తుంది కానీ పూర్తి పాటలో మాత్రం ఏంతో అద్భుతమైన, అర్థవంతమైన బాణీలున్నాయి. మరి ఎందుకు ఆలస్యం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న నాటి అసలైన పాటపై మీరూ ఓ లుక్కేయండి...





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సిస్టర్స్.. మీరే లేకుంటే ఈ మహమ్మారితో యుద్ధం చేయలేం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీనివల్ల ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అదే సమయంలో చాలామంది ఆసుపత్రుల్లో బెడ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ‘ఐఐఎంయుఎన్‌’ అనే విద్యార్థుల బృందం ‘ఫైండ్‌ ఏ బెడ్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థను యువతే ముందుండి నడిపిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ‘యువత ద్వారా.. దేశం కోసం’ (By the Youth, For the Country) అనే ట్యాగ్‌లైన్‌ని జోడించారు. 160 పట్టణాల్లో ఉన్న దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా www.Findabed.in అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్పిటల్‌ నంబర్లు, బెడ్ల వివరాలు, క్వారంటైన్‌ సెంటర్ల వివరాలు ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

పూలకుండీలతో పొట్ట చుట్టూ కొవ్వును ఇలా కరిగించండి..!

నటి సాక్షి అగర్వాల్‌ పూల కుండీలతో వ్యాయామం చేస్తోన్న తన వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నాలుగు పూల కుండీలను ఉపయోగించి ఈ అద్భుతమైన వ్యాయామాలను చేయండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉండేలా చూసుకోండి. అయితే నా దగ్గర ఇంత బరువున్న పూల కుండీలు లేవు. కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి..’ అని రాసుకొచ్చింది. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉంటుంది. మా ఇంట్లో ఈ వెయిట్స్ లేవు.. అందుకే కుండీలతో కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి..’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery