scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

భర్తలూ.. ఇది మీ కోసమే!

latest posts of celebrities on social media

క్వారంటైన్‌ నాతో ఇలా చేయించింది..!

ప్రస్తుతం దేశంలో రెండో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో వచ్చే నెల మూడో తేదీ వరకు అందరూ ఇళ్లకు పరిమితమవ్వాల్సిందే. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక అందరూ గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీతారలు ఇళ్లలోనే ఉంటూ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులను పలకరిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

తాజాగా అందాల తార పూజా హెగ్డే తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. చిట్టి పొట్టి డ్రస్‌లో తళుక్కుమన్న ఈ తార.. అద్దం ముందు నిలబడి తీసుకున్న సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ.. ‘1..2..3 గో’ అనే క్యాప్షన్‌తో పాటు ‘క్వారంటైన్‌ నాతో ఇలా చేయించింది’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం జోడించింది.

రడీ అయ్యాను.. కానీ ఎక్కడికీ వెళ్లట్లేదు..!

కరోనా వైరస్‌ పుణ్యమాని పార్టీలు, షికార్లు, సినిమాలు అన్నీ ఆగిపోయాయి. వారంతం వచ్చిందంటే చాలు స్టైలిష్‌గా రడీ అయ్యి షికార్లకు వెళ్లే సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇంట్లో ఉన్నా షికారుకు వెళ్లినట్లు రడీ అయ్యింది అందాల తార ప్రగ్యా జైస్వాల్‌.

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

గ్లామరస్‌గా రడీ అయిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అంతా రడీ అయ్యాను.. కానీ ఎక్కడికీ వెళ్లట్లేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ. దీంతో పాటు ‘లాక్‌డౌన్‌ 2.0లో తొలిరోజు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.

నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను..!

సినీ వారసత్వం అండగా ఉన్నా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌. పట్టుదలకు, కృషికి సారా ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎంతో లావుగా ఉన్న ఈ బ్యూటీ.. పట్టు వీడని కృషితో ఎంతో నాజుగ్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సినిమాల్లో రాణిస్తూనే, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఇదే క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. చిన్నతనంలో దిగిన ఫొటోను, ప్రస్తుతం దిగిన ఫొటోతో కొలేజ్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ బాలీవుడ్‌ అందం.. ‘అవును.. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది. సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పాయల్‌ ‘పిల్లో ఛాలెంజ్‌’ చూశారా..?

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే అంకితమవడంతో అంతా బోర్‌గా ఫీల్‌ అవుతున్నారు. ఏం చేయాలో తెలియక ఆన్‌లైన్‌ వేదికగా రకరకాల ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ.. వాటిని ఇతరులకూ విసురుతున్నారు.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

తాజాగా ఓ విభిన్నమైన ఛాలెంజ్‌ను విసిరింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. పిల్లో (దిండు)ను డ్రస్‌గా ధరించి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘పిల్లో ఓటీటీడీ (అవుట్‌ ఫిట్‌ ఆఫ్‌ ది డే).. క్వారంటైన్‌ క్వీన్‌.. ఇంట్లోనే ఉండడం వల్ల బోర్‌ కొట్టడంతో ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. మరి పాయల్‌ విసిరిన ఈ పిల్లో ఛాలెంజ్‌ను ఎవరెవరు స్వీకరిస్తారో చూడాలి.

గరిట పట్టిన ‘మగధీరు’డు!

ఒక వ్యక్తి బయటి ప్రపంచానికి ఎంత గొప్పవాడైనా.. భార్యకు మాత్రం ఎనలేని ప్రేమాభిమానాలను పంచే భర్తే. అందుకు తాజా సాక్ష్యం మన మగధీరుడు రామ్‌ చరణ్‌.

సినిమాల్లో ఒంటి చేత్తో వంద మందిని మట్టుపెట్టిన మగధీరుడు భార్య కోసం ఇంట్లో గరిట పట్టాడు. కిచెన్‌లో రామ్‌చరణ్‌ వంట చేస్తున్న సమయంలో తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఉపాసన.. ‘రామ్‌ చరణ్‌ నా కోసం వంట చేస్తున్న సమయంలో తీసిన వీడియో. చెర్రీ డిన్నర్‌ రడీ చేశాడు, తర్వాత అతనే అన్నీ శుభ్రం చేశాడు. ఈ పోస్ట్‌ చూస్తోన్న భర్తలూ.. ఇది మీకోసమే! (అంటే మీరు కూడా భార్య కోసం ఇంట్లో వంట చేయమని అర్థం వచ్చేలా అన్నమాట). ఇదే చెర్రీని నా హీరోగా చేసింది..’ అని అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ మెగా కోడలు.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media