scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మనమంతా కలిస్తే ఈ యుద్ధాన్ని గెలవొచ్చు..!

latest posts of celebrities on social media

పప్పీలతో పాయల్‌..!

పెంపుడు శునకాలంటే చాలామందికి ఇష్టముంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు శునకాలతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. ముఖ్యంగా చాలామంది సినీ తారలు శునకాలను తమ పెట్స్‌గా స్వీకరించడానికి ఇష్టపడుతుంటారు. అంతేనా.. సోషల్‌ మీడియా వేదికగా తమ పెంపుడు శునకాలతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు కూడా!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే షేర్‌ చేసింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. రెండు చిన్న పప్పీలను పట్టుకొని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిందీ బ్యూటీ. ఈ ఫొటోతో పాటు ఇది మేం కలిసి దిగిన తొలి ఫొటోఅనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించిందీ బ్యూటీ

ఇన్‌స్టాలో అడుగు పెట్టిన సితార..!

మహేష్‌ బాబు, నమ్రతల గారాల పట్టి సితార గురించి నెటిజన్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు చిన్నతనంలోనే నెట్టింట్లో తనదైన హంగామా చేస్తోందీ స్టార్‌ డాటర్‌. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

ఇలా ఇప్పటికే సోషల్‌ మీడియాలో లిటిల్‌ సూపర్‌ స్టార్‌గా ఎదుగుతోన్న సితార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. ‘సితార ఘట్టమనేనిఐడీ పేరుతో ఇన్‌స్టా అకౌంట్‌ను ఓపెన్‌ చేసిందీ చిచ్చర పిడుగు. సితార ఇన్‌స్టాలో 9 మందిని ఫాలో అవుతుండగా.. తనని 13వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య ఇంతగా పెరిగిందంటే ఈ క్యూట్‌ గర్ల్‌కు సోషల్‌ మీడియాలో ఎంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో అర్థమవుతుంది. ఇన్‌స్టాలో ఇప్పటి వరకు మూడు ఫొటోలను పోస్ట్‌ చేసిందీ స్టార్‌ డాటర్‌.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

మే 3 వరకూ ఇవే ఫొటోలు..!

లాక్‌డౌన్‌ కారణంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజులపాటు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ తారలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌ సమయంలో తాము దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకునే వారు ఇప్పుడు గతంలో దిగిన ఫొటోలను తిరిగి పోస్ట్‌ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

జబర్దస్త్‌షోతో ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్‌ రష్మి తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే పోస్ట్‌ చేసింది. గతంలో తీసిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఏదో షూటింగ్‌ లొకేషన్‌లో ట్రెండీ డ్రస్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన రష్మి.. ‘ఇక 2020 మే 3 వరకూ పాత ఫొటోలే (త్రో బ్యాక్‌ పిక్స్‌) పోస్ట్‌ చేస్తానుఅనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ. దీంతో పాటు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. ఇండియా కొవిడ్‌19తో యుద్ధం చేస్తోందిఅనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

మనమంతా కలిస్తే ఈ యుద్ధాన్ని గెలవొచ్చు..!

మందు లేని కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాల్సిందే.. ఇంకో మార్గం లేదు. ఈ క్రమంలోనే అంతా ఇళ్లకే పరిమితమవుతూ కంటికి కనిపించని ఈ వైరస్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. ఇక సెలబ్రిటీలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

తాజాగా మెగా ఫ్యామిలీ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం వల్ల కరోనాను అంతమొందించవచ్చనే సందేశాన్ని ప్లకార్డుల రూపంలో తెలియజేశారు.

ఈ ఫొటోలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్‌, నాగబాబు, వరుణ్‌తేజ్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌లు.. ‘ఇంట్లోనే ఉంటాం’, ‘యుద్ధం’, ‘చేస్తాం’, ‘క్రిమిని’, ‘కాదు’, ‘ప్రేమని’, ‘పంచుతాం’, ‘కాలు’, ‘కదపకుండా’, ‘కరోనాని’, ‘తరిమేస్తాం’, ‘భారతీయులం ఒక్కటై’, ‘భారత్‌ని’, ‘గెలిపిస్తాంఅని వరుసగా ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలను కొలేజ్‌ చేసిన ఫొటోను పోస్ట్‌ చేశారు చిరు. ఇక ఈ ఫొటోతో పాటు మనమంతా కలిస్తే ఈ యుద్ధాన్ని గెలుస్తాం. ఎక్కడివారు అక్కడే ఉండండి. మనం, మనం ప్రేమించే వారితో పాటు ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుదాంఅనే క్యాప్షన్‌ను జోడించారు మెగాస్టార్‌. ఈ ఫొటోలన్నీ సామాజిక దూరం పాటిస్తూ ఎవరింట్లో వారు దిగినవి కావడం విశేషం.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media