scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

లాక్‌డౌన్‌ సమయం.. రోజుకో జ్ఞాపకం..!

latest posts of celebrities on social media

యాటిట్యూడా..?

సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ ఒకరు. తన సినిమా విశేషాలతో పాటు, లేటెస్ట్‌ అవుట్‌ ఫిట్స్‌ ధరించి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం సోనమ్‌కు అలవాటు.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేసిందీ బ్యూటీ. టాప్‌ టు బాటమ్‌ బ్లాక్‌ డ్రస్‌లో తళుక్కుమన్న ఈ సుందరి.. కారు ముందు భాగంలో స్టైలిష్‌గా కూర్చున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘యాటిట్యూడా..?’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.

ఫరాఖాన్‌ కూతురు ఉదారత చూశారా..?

View this post on Instagram

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

కరోనా.. ప్రజల ఆరోగ్యాలతోనే కాకుండా ఆర్థిక వ్యవస్థనూ అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు దినసరి కూలీల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఈ క్రమంలోనే తినడానికి తిండి లేక బాధపడుతోన్న వారిని ఆదుకోవడానికి కొంతమంది దాతలు ముందుకొస్తున్నారు.

తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు ఫరాఖాన్‌ కూతురు అన్య తను సొంతంగా సంపాదించిన డబ్బులతో పేదలను ఆదుకుంటోంది. ఈ విషయాన్ని ఫరాఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో స్వయంగా పంచుకుంది. కూతురు డ్రాయింగ్‌ వేస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా 12 ఏళ్ల అన్య (కూతురు) బొమ్మలు వేయడం వల్ల కేవలం ఐదు రోజుల్లో రూ.70 వేలు సంపాదించింది (ఒక్కో చిత్రానికి రూ.1,000). ఈ డబ్బునంతా సాయం కోసం ఎదురు చూస్తోన్న వారికి అందిస్తాం. బొమ్మలు వేయమని ఆర్డర్‌ ఇచ్చిన వారికి, విరాళాలందిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది.

ఈ స్టెప్పులు మీరు వేయగలరా..?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా రోజుకో కొత్త ఛాలెంజ్‌ పుట్టుకొస్తోంది. ఇందులో కొన్ని ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లుంటే మరికొన్ని బ్యూటీ ఛాలెంజ్‌లున్నాయి. అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

తాజాగా ఇలాంటి ఓ ఛాలెంజ్‌ను విసిరింది బాలీవుడ్‌ బ్యూటీ సన్నీ లియోని. డ్యాన్స్‌ స్టెప్‌ వేస్తూ... అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. ఫన్నీ మూమెంట్స్‌తో కూడిన స్టెప్పులు వేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇవి నా సిగ్నేచర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌. వీటిని మీరు చేయగలరా? నేను వేసిన స్టెప్పులను మీరూ వేసి ఆ వీడియోను #LockedUpWithSunny, @sunnyleoneలకు ట్యాగ్‌ చేయండి. వాటిలో బెస్ట్‌ వీడియోను నేను షేర్‌ చేస్తాను’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ. మరెందుకు ఆలస్యం సన్నీ విసిరిన ఈ ఛాలెంజ్‌ను మనమూ స్వీకరించి మనలోని డ్యాన్స్‌ ట్యాలెంట్‌ను ప్రపంచానికి చూపిద్దామా?

రోజుకో జ్ఞాపకంలో భాగంగా..!

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

గడిచిన మధుర జ్ఞాపకాలను ఈ లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటోంది మహేష్‌ భార్య, నటి నమ్రతా శిరోద్కర్‌. ఇటీవలే ‘మెమరీ థెరపీ’ పేరుతో తన పాత జ్ఞాపకాలను పంచుకోవడం ప్రారంభించిన ఈ మిసెస్‌ మహేష్‌.. తాజాగా మరో ఓల్డ్‌ మెమరీని షేర్‌ చేసుకుంది.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

కూతురు సితార ‘ఒక్కడు’ సినిమాలోని ‘నువ్వేం మాయ చేశావొ గానీ’ పాట పాడుతోన్న సందర్భంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్తోన్న సందర్భంలో.. తను వాళ్ల నాన్న పాటలను మాత్రమే పాడుతుంది’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. దీంతో పాటు స్టే హోం, స్టే సేఫ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సైతం జోడించిందీ అందాల తార.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media