scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

మీ అమ్మ ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటుంది కన్నా..!

latest posts of celebrities on social media

నేను ప్రేమలో ఉన్నాను..!

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon) on

మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘వన్‌.. నేనొక్కడినే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ కృతీ సనన్‌. పేరుకు ఉత్తరాది భామే అయినా తెలుగు సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుందీ బ్యూటీ. అనంతరం తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon) on

సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కృతి తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ బుజ్జి కుక్కపిల్లను చేతిలో పట్టుకొని దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ..‘నేను ప్రేమలో ఉన్నాను’ అనే క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.

మీ అమ్మ ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటుంది కన్నా..!

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on

ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరొకటి ఉండదనడం అతిశయోక్తి కాదు. బిడ్డ ఎంత పెద్దవాడైనా తల్లికి మాత్రం చిన్న పిల్లవాడిలానే కనిపిస్తాడు. ఈ క్రమంలో తాజాగా సినీ నటి, నిర్మాత రేణూ దేశాయ్‌ కూడా తన కుమారుడిపై ఉన్న ప్రేమను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on

ఈరోజు (బుధవారం) రేణు-పవన్‌ల తనయుడు అకీరా నందన్‌ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అకీరా చిన్ననాటి ఫొటోను పోస్ట్‌ చేసిందీ సూపర్‌ మామ్‌. ఇక ఈ ఫొటోతో పాటు.. ‘16 ఏళ్ల నా బుజ్జి బాబు, మీ అమ్మ ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటుంది’ అనే అందమైన క్యాప్షన్‌ను జోడించింది రేణు.

‘బ్లూ’ వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తోంది..!

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక అవకాశమున్న కొంతమంది మాత్రం ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇళ్లకే పరిమితమవుతూ అటు ఆఫీసు పనితో కుస్తీలు పడుతున్నారు.

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

అయితే తాజాగా నటి ప్రణీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన పెంపుడు శునకానికి కళ్లజోడు పెట్టి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోబెట్టిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘బ్లూ’ ఇంటి నుంచే పనిచేస్తోంది (వర్క్‌ ఫ్రం హోమ్‌). ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి..’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి..!

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

ఎవరి వ్యక్తిగత ఆరోగ్యంపై వారే జాగ్రత్త వహించాలని చాలామంది చెబుతుంటారు. ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి గురించి ముందుగా తెలిసేది మీకే కాబట్టి! కరోనా వైరస్‌ వ్యాపిస్తోన్న వేళ ఈ జాగ్రత్తలు మరింత ఎక్కువగా పాటించాలని చెబుతున్నారంతా.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

తాజాగా నటి, వరుణ్‌ సందేశ్‌ భార్య వితికా షేరు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. స్వీయ నిర్బంధం కంటే ముందే తీసుకున్న ఫొటోషూట్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి సారించండి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ ఫొటోల్లో వైట్‌ ఫ్లోరల్‌ శారీలో, కంటికి బ్లాక్‌ షేడెడ్‌ గాగుల్స్‌ పెట్టుకొని మరింత అందంగా మెరిసిపోయింది వితిక.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram