scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా కథలు: తనకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు.. అయినా తప్పట్లేదు!'

'తల్లి ఒడి బుజ్జాయిలకు పూలపాన్పు వంటిది.. తల్లి ప్రేమ వారికి కొండంత అండ.. అందుకే చిన్నారులు మెలకువతో ఉన్నా, నిద్ర పోయినా.. అమ్మను అంటిపెట్టుకునే ఉంటారు. రాత్రుళ్లు మధ్యలో లేచినా అమ్మ పక్కన ఉంటే ఆదమరిచి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అదే తన తల్లి పక్కన లేకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. ప్రస్తుతం తను పక్కన లేని తన కూతురి పరిస్థితీ ఇలాగే ఉందంటోంది ఓ మహిళ. కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె.. తన కూతురిని కిటికీలో నుంచి చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందని చెబుతోంది. తనలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ బరువెక్కిన హృదయంతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

నన్ను వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతోందో చూడండి..!

latest posts of celebrities on social media

ఇంట్లోనే మాస్కులు తయారు చేసుకోండి..!

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే పది లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే అసలు మందే లేని ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా జాగ్రత్తపడాలంటే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడమే మార్గమమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేసారి కోట్లలో మాస్కులు ఉపయోగించాల్సి వచ్చే సరికి వాటి కొరత ఏర్పడింది. దీన్ని ఎదుర్కోవడానికి ఇంట్లోనే మాస్కులను తయారు చేసుకుంటే ఎంతో మేలని చెబుతున్నారు పలువురు సెలబ్రిటీలు.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


తాజాగా అందాల నటి రాశీఖన్నా కూడా తన అభిమానులకు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను ముక్కు నోరు కవరయ్యేలా స్కార్ఫ్‌ చుట్టుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన రాశి.. ‘నా కొత్త లుక్‌.. ఇది అందరూ చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. మీరు చేతి రుమాళ్లను, దుపట్టాలను, స్కార్ఫ్‌లను మాస్కులుగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇవేవీ పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేవు. ఇంట్లో మీరే సొంతంగా మాస్కులు తయారుచేసుకోండి.. అదే ఉత్తమం.. నా బయోలో ఉన్న ఈ వీడియో లింక్‌ని చూడండి..’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ. ఈ పోస్ట్‌తో పాటు తన ‘బయో’లో ఉన్న వీడియో లింక్‌లో మాస్కులను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో చూపించారు. మరెందుకు ఆలస్యం.. ఈ అందాల రాశి చెప్పినట్లుగా ఎంచక్కా ఇంట్లోనే మాస్కులను స్వయంగా మనమే తయారుచేసుకుందామా..?



నన్ను వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతోందో చూడండి..!


View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో జాలీగా గడుపుతున్నారు. దీనికి సెలబ్రిటీలూ అతీతులు కారు. ఎప్పుడూ బిజీగా గడిపే సినీ తారలు కూడా ఇళ్లలోనే ఉంటూ.. లాక్‌డౌన్‌ సమయంలో వారేం చేస్తున్నారో నెటిజన్లతో పంచుకుంటున్నారు.
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేసింది. చెల్లి ఖుషీ కపూర్‌తో సరదాగా గడిపిన క్షణాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ బ్యూటీ. ఖుషీ తన అక్క చేతిని ముని పంటితో బిగించగా.. ‘నా సమయాన్ని పూర్తిగా తనతోనే గడపాలని, నన్ను బయటకు వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతోందో చూడండి’ అంటూ తన చెల్లిని ఉద్దేశించి నవ్వుతూ చెబుతోన్న వీడియోను పోస్ట్‌ చేసింది జాన్వీ.




కరోనాపై మాధవీ లత కవిత విన్నారా..?

View this post on Instagram

A post shared by Madhavi Latha FC (@madhavilathafc) on

అమెరికా అధ్యక్షుడి నుంచి సామాన్యుని వరకు కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. పేద, ధనిక లాంటి తేడాలు లేకుండా అందరినీ గజగజ వణికిస్తోంది. మొన్నటిదాకా ఆర్థికంగా ఎంతో శక్తిమంతంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడీ మహమ్మారి ధాటికి చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇక కరోనాపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తమదైన శైలిలో కవితలు, పాటలు కడుతున్నారు.

@actressmaadhavi

♬ Sad - MusicoterapiaTeam

తాజాగా నటి మాధవీ లత కూడా కరోనాపై ఓ కవితను సంధించింది. ‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్ర వీగే మొదటి రకం పొగరుబోతా.. మొదట కళ్లు తెరిచి చూడు, ముసురుకున్న క్రిమిని చూడు. మొదలు లేదు, చివర లేదు.. మొదలు అయితే అదుపు లేదు. రాజు అనే భయం లేదు, పేద అనే జాలి లేదు’ అంటూ సాగే ఈ కవిత నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక వీడియో చివర్లో ‘స్టే హోం, స్టే సేఫ్‌..’ అంటూ అభిమానులకు జాగ్రత్తలు సూచించిందీ బ్యూటీ. మాధవి టిక్‌టాక్‌లో చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.




సంతోషమే ఆరోగ్యం..!

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


ఆరోగ్యం వెనకున్న రహస్యం సంతోషమేనంటూ చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈరోజు (మంగళవారం) ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవా’న్ని (వరల్డ్‌ హెల్త్‌ డే) పురస్కరించుకొని నటి సారా అలీఖాన్‌ ఇదే విషయాన్ని గుర్తుచేసింది.

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

గతంలో విదేశాల్లో జాలీగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. సానుకూల దృక్పథంతో, ప్రేరణతో ముందుకు సాగండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. మరీ ముఖ్యంగా ఈ సమయంలో (కరోనా వ్యాపిస్తోన్న నేపథ్యంలో) కచ్చితంగా ఇళ్లకే పరిమితమవ్వాలి. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి’ అంటూ క్యాప్షన్‌ జోడించిందీ బ్యూటీ.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లే నా లడ్డూలు..!

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అందుకే ఆ రోజు నాకు బాగా గుర్తుంది!

అటు నటనలోనే కాకుండా సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్న అందాల భామ శృతి హాసన్‌. చిన్నప్పటి నుంచి సంగీతంపై తనకున్న ఆసక్తే తనను గొప్ప గాయనిగా మనందరికీ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడిన ఈ చిన్నది.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని కూడా రూపొందిస్తుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన సినిమా అప్‌డేట్లతో పాటు తాను పాల్గొనే లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ విశేషాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో శృతి తన చిన్ననాటి ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ యూనిఫాం ధరించిన శృతి.. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ముందు కూర్చొని పాట పాడుతున్న ఫొటోను ఎవరో షేర్‌ చేయగా.. దాన్ని తిరిగి రీపోస్ట్‌ చేస్తూ.. ‘నేను స్కూల్‌ యూనిఫాంలో పాట పాడుతున్న ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం.. ఓ దిగ్గజ గాయని (ఆశా భోస్లే) సమక్షంలో ఎంతో నెర్వస్‌గా పాట పాడిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. అదొక మధుర జ్ఞాపకం. ఈ ఫొటోని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు..’ అంటూ పేర్కొందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నువ్వు లేని జీవితం ఊహించుకోలేను ప్రాణమా..!

ప్రస్తుతం నటనకు దూరమైనా.. సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది అందాల నటి కరిష్మా కపూర్‌. ఒక దశలో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ కపూర్‌ బ్యూటీ.. తన ట్రెండీ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో ఈ తరం తారలకు గట్టి పోటీనిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఈ తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయిందీ సుందరి. ఈ క్రమంలో కరిష్మా ఇటీవల ధరించిన ఓ అందమైన మోనోక్రోమ్‌ అవుట్‌ఫిట్‌కి సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. వైట్‌-బ్లాక్‌ స్ట్రైప్‌డ్‌ వైడ్‌ లెగ్‌ ప్యాంట్స్‌ని ధరించిన కరిష్మా.. దానికి ఫుల్‌ స్లీవ్స్‌ వైట్‌ షర్ట్‌ను జతచేసి ప్రొఫెషనల్‌ బ్యూటీగా మెరిసిపోయింది. కాస్త హెవీ మేకప్‌, జడతో అదరగొట్టిన ఈ బాలీవుడ్‌ అందం.. అచ్చం లేడీ బాస్‌ని తలపించింది. మరి, ఈ బాస్‌ బేబీ ప్రొఫెషనల్‌ లుక్‌ని మీరూ ఫాలో అయిపోండి.

Know More

women icon@teamvasundhara
latest-social-media-posts-of-celebrities
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా చేస్తే సంతోషం మన ఇంట్లోనే దొరుకుతుంది!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేనంత క్రేజ్‌ ఈ హ్యాండ్‌సమ్‌ హీరోకి ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 9 మిలియన్లు దాటింది. ట్విట్టర్‌లో ఇప్పటివరకూ ఇంతమంది ఫాలోవర్లు మరే ఇతర సౌత్‌ ఇండియన్‌ హీరోకీ లేరు. ఈ విషయంపై స్పందిస్తూ.. మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా ట్వీపుల్‌కి 9 మిలియన్ల ధన్యవాదాలు! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనవాళ్లందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు..’ అంటూ రాసుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హంక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media-
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలాంటి మాటల కంటే మౌనమే మేలు !

ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా నిత్యం బిజీగా ఉంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నా.. ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది లక్ష్మి. ఇక వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూతురు విద్యా నిర్వాణతో ఎక్కువ సమయాన్ని గడుపుతుందీ సూపర్‌ మామ్‌. ఇటీవలే ఈ అందాల అమ్మ తన చిట్టిపొట్టి చిన్నారితో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. సందర్భానికి తగ్గట్లుగా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్‌ క్వీన్‌గా కూడా పిలిపించుకుంటోంది. ఇలా తాను దిగిన ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ లవ్లీ మామ్‌.. తాజాగా మరో ఫొటోను పంచుకుంది. తాను ట్రెడిషనల్‌గా చీరకట్టులో ముస్తాబై సైడ్‌ లుక్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘ఏంటి.. ఆ చూపేంటి’? అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ లుక్‌లో భాగంగా బ్లూ కలర్‌ చీరలో, బంగారు ఆభరణాల్లో ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇంతకంటే ఇంకేం కావాలి?

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అల్లు అర్జున్‌- స్నేహల ముద్దుల తనయ అల్లు అర్హకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ గారాల పట్టి అర్హకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటారీ లవ్లీ కపుల్‌. ఈ క్రమంలో బన్నీ ఇన్‌స్టా వేదికగా తన ముద్దుల పాప అర్హ తనతో ముద్దుముద్దుగా మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్‌ చేశాడు. ‘నీ ఫేవరేట్‌ కలర్‌ ఏంటి బే’ అని అల్లు అర్జున్‌ అడగ్గా ‘పింక్‌ బే..’ అంటూ అర్హ ఫన్నీగా సమాధానమిస్తుంది. ఇలా తండ్రీకూతుళ్లిద్దరూ ఒకరినొకరు బే అంటూ సాగే సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ స్టైలిష్‌ డాడ్‌.. ‘తనే నా బే..’ అనే క్యాప్షన్‌తో తండ్రీకూతుళ్ల ప్రేమకు నిదర్శనమిది అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అప్పుడు నాకు మాటలు రావు.!

యాంకర్‌గా, నటిగా ఎంతో బిజీగా ఉండే అనసూయ కాస్త సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళుతుంటుంది. తన విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అనసూయకు అలవాటు. ఈక్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. తను వెళ్లిన ప్రదేశం ఏంటో చెప్పక పోయినప్పటికీ ప్రకృతి రమణీయతతో ఉన్న ఆ ప్రదేశంలో తలకు క్యాప్‌, చేతులకు గ్లౌజ్‌లు పెట్టుకొని సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన అను.. ‘తరచూ చేసే ప్రయాణాలు.. ఎప్పటికీ అద్భుతంగా ఉంటాయి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అందుకు అసలైన ఎనర్జీ ఇదే!

మాధురీ దీక్షిత్‌... ఒకప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఓ సంచలనం. 90ల్లో కుర్రాళ్లను ఈ పేరు నిద్ర లేకుండా చేసింది. తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో వెండితెర రాణిగా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. మధ్యలో సినిమాలకు కాస్త విరామం తీసుకున్నా.. ఇప్పుడు మళ్లీ బిజీగా మారి ఈ తరం నాయికలకు కూడా సవాల్‌ విసురుతోందీ బ్యూటీ. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా... సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోందీ యమ్మీ మమ్మీ. 52 ఏళ్ల వయసులోనూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా.. మోడ్రన్‌గా ముస్తాబై చేతిలో కాఫీ కప్పు పట్టుకొని స్టైలిష్‌ లుక్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది మాధురి. ఇక ఆ ఫొటోకు.. ‘కొన్నిసార్లు మీరు చూసే విధానం కొత్తగా ఉండాలి’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇంతటి ఆనందం ఉండగా... మాటలెందుకు దండగ !

ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేసుకునే సెలబ్రిటీ కపుల్స్‌లో షాహిద్‌ కపూర్‌- మీరా రాజ్‌పుత్‌ జంట ఒకటి. షాహిద్‌ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తుంటాడు. ఇలా కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం షాహిద్‌ బెటరాఫ్‌ మీరాకు అలవాటే. నేడు షాహిద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీరా ఇన్‌స్టా వేదికగా శ్రీవారికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. వీళ్లిద్దరూ కలిసున్న ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ ప్రేమగా రాసుకొచ్చిందీ వైఫీ.

Know More