scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

తిన్నామా.. పడుకున్నామా.. నెట్‌ఫ్లిక్స్‌ చూశామా..!

latest posts of celebrities on social media

ఇలా జరగాలనుకుంటున్నా..!

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal) on

కరోనా మహమ్మారి ఎప్పుడు అంతరిస్తుందా?  అని యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేల మందిని పొట్టన పెట్టుకుంటోన్న ఈ వైరస్‌ను నాశనం చేసే టీకా ఎప్పుడు కనుక్కుంటారా?, ఎప్పుడెప్పుడు స్వేచ్ఛగా బయట విహరిద్దామా? అని అనుకోని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal) on

అచ్చంగా ఇలాంటి కోరికనే బయటపెట్టింది అందాల నటి స్నేహా ఉల్లాల్‌. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్‌ చేసిందీ బ్యూటీ. ‘రోజా పూలు ఎర్రగా ఉంటాయి.. ఏప్రిల్‌  గ్రే కలర్‌లో ఉంటుంది.. మే నెలలో మనం ఇళ్ల నుంచి స్వేచ్ఛగా బయటకు వెళతామని ఆశిస్తున్నాను..’ అని ఫన్నీ కొటేషన్‌ రాసున్న ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇలా జరగాలని అనుకుంటున్నాను’ అని క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ లవ్లీ గర్ల్‌.

నిన్ను టన్నుల కొద్దీ ప్రేమిస్తున్నాను..!

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

అనిల్‌ కపూర్‌  నట వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి సోనమ్‌ కపూర్‌. సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్‌  మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన జీవితంలోని మధుర క్షణాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

సోనమ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తన ఆంటీ కవితా సింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో చిన్నతనంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మాసూ.. నిన్ను టన్నుల కొద్దీ ప్రేమిస్తున్నాను’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ ఫొటోలో చిన్నతనంలో ఎంతో క్యూట్‌గా ఉన్న సోనమ్‌ని చూసి అభిమానులు మనసు పారేసుకుంటున్నారు.

సిబ్లింగ్‌ లవ్‌!

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాలను ఎంతగా ప్రేమిస్తుందో కుటుంబంతో సమయం గడపడానికీ అంతే సమయం కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే.  సోషల్‌ మీడియా వేదికగా తాను షేర్‌ చేసే ఫ్యామిలీ ఫొటోలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. తాజాగా రకుల్‌ తన సోదరుడి పుట్టిన రోజును పురస్కరించుకొని ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

తమ్ముడితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘1993 నుంచి నన్ను నవ్విస్తూనే ఉన్నాడు. నువ్వే నా బలం, నువ్వే నా శక్తి.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి నువ్వే.  నా ప్రియమైన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నువ్వెంతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మౌగ్లీకి ప్రేమతో..!’. అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ అందాల తార.

మీరు దేనిపట్ల కృతజ్ఞతతో ఉన్నారు..?

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక దానిపై తన కృతజ్ఞతను చాటుకుంటాడు.  కొందరు తమకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటే.. మరి కొందరు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటారు.  అయితే మీరు ఎవరి పట్ల కృతజ్ఞతతో ఉన్నారని ప్రశ్నిస్తోంది అందాల నటి అదా శర్మ. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోన్న ఈ చిన్నది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టిందీ బ్యూటీ. పూజగదిలో దేవుణ్ని పూజిస్తూ.. అయిగిరి నందినిపాట పాడుతూ ఉన్న వీడియోను పోస్ట్‌ చేస్తూ.. మీరు కృతజ్ఞత చూపించే ఒక అంశమేంటో చెప్పండి?... మీ జాబితా చాలా పెద్దదిగా ఉంటుందని నాకు తెలుసు. కానీ వాటిలో ఒకటైనా ఈ కామెంట్‌ సెక్షన్‌ ద్వారా నాతో పంచుకోండిఅంటూ క్యాప్షన్‌ను జోడించింది.

తిన్నామా.. పడుకున్నామా.. నెట్‌ఫ్లిక్స్‌ చూశామా..!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

‘కరోనా’ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న వేళ.. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవ్వరూ బయట అడుగు పెట్టే సాహసం చేయట్లేదు.  ఇక ఇన్ని రోజులు ఎంచక్కా.. స్వేచ్ఛగా బయట తిరిగిన వారంతా.. ప్రస్తుతం ఇళ్లలోనే బందీలుగా మారారు. దీంతో ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

తాజాగా తాను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాను అని చెప్పుకొచ్చింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. సినిమాల్లో తన అందంతో అభిమానులను కట్టిపడేసే ఈ అందాల తార ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంది. గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో తాను ఏం చేస్తుందో అభిమానులతో పంచుకుందీ లవ్లీ గర్ల్‌. టీవీ చూస్తూ, ఏదో తింటూ, నిద్రపోతూ, మొబైల్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేస్తూ.. ఇలా రకరకాల ఫొటోలను ఒకచోట చేర్చిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘తినడం.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడడం.. పడుకోవడం.. మళ్లీ వీటినే రిపీట్‌ చేయడం’ అని అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ అమ్మడు.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram