scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అలా మా ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాడు!

latest posts of celebrities on social media

హ్యాపీ ఫ్యామిలీ!

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. చివరికి ఆసుపత్రులను కూడా కేవలం అత్యవసర సేవలకే ఉపయోగిస్తోన్న పరిస్థితి వచ్చింది. ఇక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంటి నుంచి బయట అడుగుపెట్టడానికి జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉంటూ తాము చేస్తోన్న పనులకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

తాజాగా బాలీవుడ్‌ అందాల తార సన్నీ లియోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. భర్త, పిల్లలతో కలిసి ఇంట్లోనే జాలీగా ఎంజాయ్ చేస్తోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసిన సన్నీ.. ‘మా చిన్నారులతో కలిసి జోష్‌ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా పిల్లలు చాలా రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. నేను, డేనియల్ (సన్నీ భర్త) కలిసి ప్రతిరోజూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. డేనియల్‌ ఎంతో అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్నాడు (నవ్వులు)’ అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

ఎంత ‘శ్రద్ధ’గా వర్కవుట్లు చేస్తోందో..!

View this post on Instagram

A post shared by Shraddha (@shraddhakapoor) on

కరోనా వైరస్‌ పుణ్యమాని చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి చివరికి సినిమా షూటింగ్‌లు కూడా వాయిదా పడ్డాయి. దీంతో హీరో, హీరోయిన్లు కూడా ఇంటికే పరిమితమయ్యారు. చివరికి జిమ్‌లు కూడా మూతపడిన నేపథ్యంలో వారు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి లాక్‌డౌన్‌ అనే సాకులు చెప్పకుండా ఎవరికి వారు ఇళ్లలోనే కసరత్తులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Shraddha (@shraddhakapoor) on

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే పోస్ట్‌ చేసింది అందాల తార శ్రద్ధా కపూర్‌.  బిల్డింగ్‌ టెర్రస్‌పై చేస్తోన్న వర్కవుట్లకు సంబంధించిన ఓ షార్ట్‌ వీడియోను అభిమానులతో పంచుకుందీ ముద్దుగుమ్మ. ఇక ఈ వీడియోతో పాటు.. ‘ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. ’ అనే క్యాప్షన్‌తో పాటు టెర్రస్‌ వర్కవుట్స్‌, జాగ్రత్తగా ఉండండి.. మండే మోటివేషన్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ బ్యూటీ.

మా ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాడు!

సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండడం మహేష్‌ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్‌కు అలవాటనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు భర్త మహేష్‌ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవడం నమ్రతకు అలవాటే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాపిస్తోన్న నేపథ్యంలో నమ్రత కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికే పరిమితమైంది. తాజాగా లాక్‌డౌన్‌ సమయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సూపర్‌ మామ్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

నైట్‌ సూట్‌లో ముస్తాబై సోఫాపై కూర్చొని నవ్వుతోన్న మహేష్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన నమ్రత.. ‘లాక్‌ డౌన్‌ టైమ్స్‌… ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఆయన (భర్త మహేష్‌ను ఉద్దేశిస్తూ) తనదైన హాస్యంతో మా ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాడు.  అతనే నా సూపర్‌ డూపర్‌ బెటర్‌ హాఫ్‌. తననెంతగానో ప్రేమిస్తున్నా..’  అనే అందమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది నమ్రత.

బన్నీ.. నువ్వు ఇదెలా చేశావ్‌..?

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని ఒక్కో పాట ఒక్కో సంచలనమని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలోని పాటలకు బన్నీ వేసిన స్టెప్పులు కూడా అభిమానులను మెస్మరైజ్‌ చేశాయి.

తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశా పటానీ కూడా బన్నీ డ్యాన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ‘బుట్ట బొమ్మ’ పాటలో ఏటవాలుగా జారుతూ వేసిన ఓ స్టెప్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన దిశా.. ‘బన్నీ అసలు నువ్వు ఇదెలా చేశావు?’ అని క్యాప్షన్‌ను జోడించింది. ఇక పోస్ట్‌ను చూసిన బన్నీ.. ‘నేను మ్యూజిక్‌ను ప్రేమిస్తాను.. మంచి మ్యూజిక్‌ నాతో డ్యాన్స్‌ చేయిస్తుంది. మీ ప్రశంసలకు కృతజ్ఞతలు’ అంటూ రిప్లై పెట్టాడీ స్టైలిష్‌ స్టార్‌. ఇలా బన్నీ ఇచ్చిన రిప్లైని స్ర్కీన్‌షాట్‌ తీసి అభిమానులతో పంచుకున్న దిశ.. ‘మా అందరిలో స్ఫూర్తి నింపుతున్నందుకు మీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram

Movie Masala

Video Gallery